గాంధీనగర్: జాతీయ రహదారిని దాటుతున్న గొర్రెలు, మేకల మందలపైకి ఒక లారీ వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 25 జీవాలు మరణించాయి. మరో 30 గాయపడ్డాయి. హైవేపై ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Truck Runs Over Flock Of Sheep) గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 7న మాలియా-మియానా సమీపంలోని కచ్ జాతీయ రహదారిపై కొందరు కాపరులు గొర్రెలు, మేకల మందలను తరలిస్తున్నారు. హైవేను ఆ మందలు దాటుతుండగా ఒక భారీ లారీ వేగంగా వాటి పైనుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 23 గొర్రెలు, 2 మేకలు మరణించాయి. మరో 30 జీవాలు తీవ్రంగా గాయపడ్డాయి. గొర్రెలు, మేకల మందలు చెల్లాచెదురయ్యాయి. కాపరులు ఆ లారీని అడ్డుకుని నిలువరించారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న మలియా-మియానా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గొర్రెలు, మేకల మందల యజమానుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ హైవేపై ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డైన ఈ ప్రమాదానికి చెందిన షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#BREAKING Tragedy strikes on Kandla-Morbi Highway! A speeding truck plowed into a herd, killing 25 sheep and goats and injuring 30+ animals in Morbi. Authorities must act against reckless driving!
#GujaratNews #MorbiAccident #AnimalSafety 📍 @GujaratPolice @CMOGuj @MoRTHIndia https://t.co/M2kXvf8Xgy
— jarvis ☠️ (@Vishii14) October 8, 2026