నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని. అనే పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ అనే పాట కూడా అప్పట్లో మార్మోగింది. బుల్లెట్ బండికి ఇప్పుడే కాదు ఎప్పటినుంచో చాలా క్రేజ్ ఉంది. అందుకే.. ఆ బండి మీద పాటలు కూడా వస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం బుల్లెట్ డాక్టర్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. హైదరాబాద్‌కు చెందిన ఆర్ సుధాకర్‌ను అందరూ బుల్లెట్ డాక్టర్ అని పిలుస్తారు. దానికి కారణం ఏంటో తెలుసా? గత 50 ఏళ్ల నుంచి బుల్లెట్ బండిని రిపేర్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు సుధాకర్.