భూమికి చేరిన స్పేస్ ఎక్స్ వాహక నౌక
స్పేస్ ఎక్స్ | మెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ మరోసారి చరిత్ర సృష్టించింది. నలుగురు యాత్రికులతో మూడు రోజుల క్రితం అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వాహక నౌక

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ మరోసారి చరిత్ర సృష్టించింది. నలుగురు యాత్రికులతో మూడు రోజుల క్రితం అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వాహక నౌక డ్రాగన్ ‘స్పేస్ క్యాప్సుల్’ సురక్షితంగా భూమికి చేరింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఫ్లోరిడాలోని సముద్రంలో దిగింది. గంట తర్వాత యాత్రికులు అందులో నుంచి చిరునవ్వులు చిందిస్తూ బయటకు వచ్చారు. దీనిని స్పేస్ ఎక్స్ యూట్యూబ్ చానల్లో ప్రత్యక్ష ప్రసారం చేసింది.

సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ వైద్యాధికారిణి హేలీ ఆర్సెనాక్స్ (29), టీవీ నటి సియాన్ ప్రోక్టర్ (51), ఏరోస్పేస్ డేటా ఇంజినీర్ క్రిస్ సెంబ్రోస్కీ (42), జారెడ్ ఐజాక్మన్ (38) స్పేస్ ఎక్స్ వాహక నౌక డ్రాగన్ ‘స్పేస్ క్యాప్సూల్’ ద్వారా బుధవారం రాత్రి ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లారు. ‘ఇన్స్పిరేషన్-4’ అనే ఈ మిషన్‌లో భాగంగా 540 కిలో మీటర్ల ఎత్తులో.. మూడు రోజుల పాటు గడిపారు. స్పేస్ ఎక్స్ నిర్వహించిన మొదటి ప్రైవేటు రైడ్ ఇదే కావడం గమనార్హం.

#WATCH | After orbiting Earth for 3 days, four astronauts of Inspiration4 flying aboard SpaceX’s Dragon spacecraft safely splashed down in Atlantic Ocean off coast Florida, US today, marking the completion of world’s first all-civilian human spaceflight to orbit
— ANI (@ANI) September 18, 2021
(Video: SpaceX) pic.twitter.com/HNeuHq3b2t
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

