ఆమె కల.. అంతరిక్ష కాలనీ!
అందరూ మహానగరాల్లో రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తున్న దశలో స్పేస్ ఆర్కిటెక్ట్ ఆస్తా కచా మాత్రం అంతరిక్షంలో కాలనీలు ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తున్నది. ఆ ప్రయత్నానికి కృత్రిమ మేధను జోడిస్తున్నది. ఇప్పటికే నాసా, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, స్పేస్ ఎక్స్ తదితర అంతరిక్ష సంస్థలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నాయి
అందరూ మహానగరాల్లో రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తున్న దశలో స్పేస్ ఆర్కిటెక్ట్ ఆస్తా కచా మాత్రం అంతరిక్షంలో కాలనీలు ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తున్నది. ఆ ప్రయత్నానికి కృత్రిమ మేధను జోడిస్తున్నది. ఇప్పటికే నాసా, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, స్పేస్ ఎక్స్ తదితర అంతరిక్ష సంస్థలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ‘ఆధునిక విజ్ఞానాన్ని జోడించి ప్రపంచానికి నా వంతుగా ఏదైనా చేయాలని ఉంది’ అంటుంది ఆస్తా. ఆమె తల్లిదండ్రులు భారతీయులు. అహ్మదాబాద్ వాసులు. కెనడాలో స్థిరపడ్డారు. దీంతో అక్కడే చదువుకుంది ఆస్తా.
కెనడాతోపాటు అహ్మదాబాద్లో తనకు ప్రయోగశాల ఉంది. ఇక్కడే తన సృజనకు ప్రాణంపోసి అంతరిక్ష కాలనీ డిజైన్ చేసింది. భారతీయ మూలాలపై తనకు అపార నమ్మకం. ప్రాచీన గ్రంథాల్లోని భవన నిర్మాణ సూత్రాలపైనా అధ్యయనం చేస్తున్నది. ఆమె ఆలోచనలు ఆకాశంలో ఉన్నా.. ఆశయాలు మాత్రం భూమి మీదున్న మనుషుల చుట్టూ తిరుగుతుంటాయి. నిరుపేదలకు చవకైన ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఆస్తా సంకల్పం. దీనికి సంబంధించిన పనులూ చురుగ్గా జరుగుతున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

