ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో ‘ఆర్గానిక్ మామ, హైబ్రీడ్ అల్లుడు’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సొహైల్, అనన్య జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. వరుణ్ సందేశ్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. అమ్ము క్రియేషన్స్ సమర్పణలో కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ…‘మీ తరహా కామెడీ సినిమాలు రావడం లేదని చాలా మంది అడుగుతుండేవారు. నాకూ అదే ఫీలింగ్ ఉండేది. కథలు రాసుకుంటూ సరైన నిర్మాత కోసం వేచి చూశాను. ఈ క్రమంలో కొంత గ్యాప్ వచ్చింది. సోహైల్, అనన్య మంచి జోడీ కుదిరారు. తెలుగు ప్రేక్షకుల ఆదరణ మరోసారి ఇస్తారని కోరుకుంటున్నా’ అన్నారు. ఖుష్బూ, అలీ, సునీల్, రష్మీ, హేమ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సి రామ్‌ప్రసాద్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, సాహిత్యం : చంద్రబోస్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

