సోహైల్, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్న సినిమా ‘బూట్ కట్ బాలరాజు’. లక్కీ మీడియా, గ్లోబల్ ఫిలింస్ పతాకాలపై బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో శ్రీ కొన్నేటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సోహైల్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేశారు. యాక్షన్‌తో పాటు సరదా డైలాగ్స్‌తో ఈ గ్లింప్స్ ఆకట్టుకుంది. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ…కథ మీద పూర్తి కసరత్తు చేసి షూటింగ్‌కు వెళ్లాం. ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతూ సినిమా ముగింపునకు చేరుకున్నాం. కుటుంబంతో కలిసి చూసేలా సినిమాను రూపొందిస్తున్నాం’ అన్నారు.