ఆర్డర్.. ఆర్డర్!
చూపులో చులకన. మాటలో ద్వంద్వార్థం. సంబోధనలో క్రూరత్వం. భావంలో బూతు. ఎన్నాళ్లు, ఎన్నేళ్లు? కోరు ్టపదజాలంలో తిష్ఠవేసిన బూజుపట్టిన వ్యక్తీకరణలను.. రికార్డుల నుంచి తొలగించాలని, వాడుక నుంచి నిషేధించాలని సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం తీర్మానించింది.
చూపులో చులకన. మాటలో ద్వంద్వార్థం. సంబోధనలో క్రూరత్వం. భావంలో బూతు. ఎన్నాళ్లు, ఎన్నేళ్లు? కోరు ్టపదజాలంలో తిష్ఠవేసిన బూజుపట్టిన వ్యక్తీకరణలను.. రికార్డుల నుంచి తొలగించాలని, వాడుక నుంచి నిషేధించాలని సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం తీర్మానించింది. మహిళ వ్యక్తిత్వాన్ని, వృత్తిని, ప్రవృత్తిని అవహేళన చేస్తున్నట్టు ఉండే వాడుక పదాలకు ప్రత్యామ్నాయాలనూ సూచించింది. ‘హ్యాండ్ బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్’ పేరుతో వెలువరించిన లఘు పుస్తకం ఓ మంచి ప్రయత్నం. ఇందులోని ముఖ్యాంశాలు..

అపోహలూ అపార్థాలూ
మహిళ పట్ల సమాజానికి చులకన భావం. ఆమెను మానసికంగా కుంగదీయడానికి, నైతికంగా దెబ్బకొట్టడానికి పురుషాధిక్య సమాజం చేయని కుతంత్రమంటూ లేదు. సర్వోన్నత న్యాయస్థానం వాటిని కూడా తీవ్రంగా ఖండించింది. ‘మహిళలకు భావోద్వేగాలు ఎక్కువ, ఆలోచన తక్కువ. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చేతకాదు’, ‘ఆమె అబల. పురుషుడి చేతిలో ఓడిపోవాల్సిందే’, ‘ఆడపిల్లలు స్వతంత్రంగా తమ జీవిత భాగస్వామిని ఎంచుకోలేరు’, ‘ఆడవాళ్లు పిల్లల్ని కనడానికి తపిస్తుంటారు’,
‘ఆత్మాభి మానం ఉన్న మహిళ అత్యాచారం కంటే మరణమే మేలనుకుంటుంది’.. హేతువాదానికి అతీతమైన ఇలాంటి ప్రచారాలనూ తోసిపుచ్చింది. ఇంటిపని ఆమె బాధ్యతే, భర్తకు సపర్యలు చేయాల్సింది ఆమే, అణగిమణగి ఉండటం స్త్రీ సహజ గుణం.. అనుకోవడం సరికాదని తేల్చి చెప్పింది. ‘న్యాయస్థానాలు నిష్పాక్షికమైన తీర్పులు ఇవ్వడంలో ఈ హ్యాండ్‌బుక్ ఉపయోగపడుతుందనే భావిస్తున్నా’ అంటూ ఆశావాదాన్ని వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eenadu | చెంపలేసుకున్న ఈనాడు పత్రిక.. కేటీఆర్‌కు క్షమాపణ.. తప్పుడు వార్తకు పత్రిక చరిత్రలో మొదటిసారీ
Tummidihatti | తమ్మిడిహట్టి పాట.. రేవంత్ తొండాట.. ఏదీ తేలకున్నా ఏదో సాధించినట్టు కాంగ్రెస్ గొప్పలెందుకు?
Horoscope | 27-10-2026 మంగళవారం.. మీ రాశి ఫలాలు
రక్తపోటుపై రీనల్ డీనర్వేషన్ అస్త్రం
రక్తంలో ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గుతాయి?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

