సమాజంపై సినిమాల ప్రభావం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సమయాన్ని, సందర్భాన్ని బట్టి ఏదో సినిమాను స్పూర్తిగా తీసుకుంటుంటారు జనాలు. సినిమాలను స్ఫూర్తిగా తీసుకుని మంచి చేయడమే కాదు..దొంగతనాలు, మోసాలు జరిగిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇంతకీ ఇదంతా చెప్పడానికి ఒక కారణముంది..ఇటీవలే పుష్ప (Pushpa)లో ఎర్రచందనం (Pushpa Smuggler ) స్మగ్లర్‌గా అల్లు అర్జున్ కనిపించగా..ఆ పాత్రకు అద్బుతమైన స్పందన వచ్చింది.
ఇపుడిదే రోల్‌ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఓ స్మగ్లర్ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేశాడు. కానీ పుష్పరాజ్‌లా పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయాడు. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు . పుష్ప సినిమాలోలాగే కూరగాయల లారీలో ఎర్రచందనం దుంగలను తీసుకెళ్తుంటే..అనుమానం వచ్చిన కర్ణాటక పోలీసులు తనిఖీలు చేశారు. లారీలో సుమారు 2.5 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఇంత విలువైన ఎర్రచందనాన్ని లారీలో తీసుకెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు లోనయ్యారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.