భారత్‌లో త్వరలో స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ విడుదల : రష్యా రాయబారి
భారత్‌లో త్వరలో స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ | కొవిడ్-19 సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ త్వరలో భారత్‌లో విడుదల కానుందని రష్యా రాయబారి నికోలాయ్ కుడాషేవ్ బుధవారం తెలిపారు. స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ భారతీయ వ్యాక్సినేషన్లో భాగం కావడం క్రమంగా పెరుగుతుందని,

మాస్కో : కొవిడ్-19 సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ త్వరలో భారత్‌లో విడుదల కానుందని రష్యా రాయబారి నికోలాయ్ కుడాషేవ్ బుధవారం తెలిపారు. స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ భారతీయ వ్యాక్సినేషన్లో భాగం కావడం క్రమంగా పెరుగుతుందని, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను సైతం త్వరలోనే ప్రారంభించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మాస్కోలో రష్యన్-భారత విదేశాంగ మంత్రుల చర్చల ఫలితాలపై మాట్లాడారు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పరస్పరంగా గుర్తించడానికి చర్చలు కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
ఆగస్ట్‌లో భారత్ అధ్యక్షత వహించనున్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో మరింత సమన్వయాన్ని పెంపొందించేందుకు దృష్టి పెట్టామన్నారు. ఇదిలా ఉండగా.. రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) జూలై చివరి నాటికి స్పుత్నిక్ వీ, ఆస్ట్రాజెనెకా ‘మిక్స్ అండ్ మ్యాచ్’ టీకా ఫలితాలను విడుదల చేయాలని భావిస్తోంది. ఆర్డీఎఫ్ సీఈఓ కిరిల్ డిమిత్రివ్స్ ఇటీవల మాట్లాడుతూ ట్రయల్స్‌లో అధిక సామర్థ్యం ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. జూలై చివరి నాటికి టీకాల మిక్స్ అండ్ మ్యాచ్ ఫలితాలను విడుదల చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానాన్ని స్పుత్నిక్ వీ ప్రారంభించింది.
భారత్‌లో కొవిషీల్డ్‌తో సరిపోలుస్తున్నామని, ఫలితం గొప్పగా ఉంటుదని, కోవిషీల్డ్ ఆస్ట్రాజెనెకా మాదిరి వ్యాక్సిన్ కాబట్టి ట్రయల్స్ సామర్థ్యాన్ని చూపుతున్నాయని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తుండగా.. సెప్టెంబర్‌లో మొదటి బ్యాచ్ విడుదల కానుంది. రెండు కంపెనీలు కలిసి సంవత్సరానికి 300 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేయాలని భావిస్తున్నాయి. స్పుత్నిక్ వ్యాక్సిన్ ఉత్పత్తికి భారత్ కేంద్రంగా నిలుస్తోంది. రష్యన్ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఆర్డీఐఎఫ్ భారత్‌లో పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

