ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే ఓ క్యాటరింగ్ ఓనర్‌పై చేయి చేసుకున్నాడు. నాణ్యమైన ఆహారం ఇవ్వడం లేదని అతని చెంప చెల్లుమనిపించాడు. ఎమ్మెల్యే సంతోష్ బాంగర్ .. క్యాటరింగ్ మేనేజర్‌పై చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హింగోలీ జిల్లాలో కార్మికులకు మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని చేపడుతున్న క్యాటరింగ్ మేనేజర్‌ను ఎమ్మెల్యే నిలదీశారు. నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నట్లు తమకు ఫిర్యాదు అందినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆ ఫిర్యాదు మేరకు తాను తనిఖీ చేసినట్లు చెప్పారు.
शिंदे गटामध्ये सामील झालेले हिंगोलीचे आमदार संतोष बांगर यांचा एक व्हिडीओ सध्या व्हायरल होताना दिसत आहे. यामध्ये संतप्त झालेल्या बांगर यांनी एकाच्या कानशिलात लगावली असल्याचे पाहायला मिळते.#SantoshBangar #ViralVideo #MumbaiTak pic.twitter.com/Dp9IMmxIk4
— Mumbai Tak (@mumbaitak) August 15, 2022
హింగోలీ నియోజకవర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంతోష్ బాంగర్.. జూలైలో జరిగిన అసెంబ్లీ బలపరీక్ష సమయంలో చివరి నిమిషంలో షిండే వర్గంలో చేరారు. హింగోలీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి బాంగర్ను శివసేన నాయకత్వం తప్పించింది. తొలుత ఉద్దవ్ ఠాక్రే వైపు నిలిచిన ఎమ్మెల్యే బాంగర్ ఆ తర్వాత షిండే వర్గానికి మద్దతు ఇచ్చారు.