అసెంబ్లీలో చొక్కా విప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వారం రోజులు సస్పెండ్

బెంగళూరు: కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేష్ గురువారం అసెంబ్లీ సమావేశాల్లో చొక్కా విప్పారు. దీనిపై ఆగ్రహించిన స్పీకర్ ఆయనను సభ నుంచి వారం రోజులు సస్పెండ్ చేశారు. అనంతరం సభను వాయిదా వేశారు. కర్ణాటక బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం అసెంబ్లీ జరిగింది. కాగా, పార్లమెంట్ ఎన్నికలతో కలిపి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సీఎం బీఎస్ యెడియూరప్ప ప్రభుత్వం భావిస్తున్నది. దీనిపై తీర్మానం కోసం అసెంబ్లీలో ఈ అంశంపై చర్చించాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఈ అంశంపై గురువారం సభలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
ఈ సందర్భంగా భద్రవిరి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేష్ తన చొక్కా విప్పి ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా సభలో నినాదాలు చేశారు. దీనిపై ఆగ్రహించిన స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి, ఆ ఎమ్మెల్యేను వారం రోజులు సభ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం సభను వాయిదా వేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

