తీర్చిదిద్ది.. దారి చూపి..
- నిరుద్యోగ యువతకు ఉపాధి బాటలు
- ఉచిత శిక్షణ ఇచ్చి.. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా తర్ఫీదు
- సిటీ పోలీస్‌ల కృషికి స్కోచ్ అవార్డు

సిటీబ్యూరో, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతను తీర్చిదిద్ది.. దారి చూపిస్తున్నారు.. సిటీ పోలీసులు. మేమున్నామనే భరోసా కల్పిస్తూ.. ఉపాధికి బాటలు వేస్తున్నారు. సన్మార్గంలో నడిపిస్తూ.. పోటీ పరీక్షల్లో రాణించేలా కావాల్సిన ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారు. నగర పోలీసులు చేస్తున్న కృషికి గుర్తింపుగా 2021 స్కోచ్ అవార్డు వరించింది.
కమ్యూనిటీ పోలీసింగ్‌తో..
ఫ్రెండ్లీ, కమ్యూనిటీ పోలీసింగ్‌తో ప్రజలకు మరింత దగ్గరయ్యారు నగర పోలీసులు. కాలనీలు, బస్తీల్లో ప్రభు త్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారిని కలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు 5 వేల మందికి ఉచిత శిక్షణ ఇవ్వగా, అందులో 1017 మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరోవైపు జాబ్ కనెక్ట్‌తో ప్రైవేట్‌లో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ అన్ని రాష్ర్టాల పోలీసులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మన నగర పోలీసులు.
ఉచిత శిక్షణ
పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల కాగానే 2015లో ఉచిత శిక్షణ తరగతులను సిటీ పోలీసులు ప్రారంభించారు. ఆ తరువాత 2018-19లో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాగా, నిరుద్యోగులకు తర్ఫీదు ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ప్రకటించడంతో వారు కూడా ఉద్యోగాలు సాధించే విధంగా సిటీ పోలీసులు ప్రోత్సహించారు. రెండు దఫాలుగా నిర్వహించిన ఉచిత శిక్షణలో 5 వేల మంది హాజరయ్యారు. అందులో 1017 మంది కానిస్టేబుల్, డ్రైవర్లుగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
అవార్డు రావడం ఆనందంగా ఉంది
నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తరఫున ఉచిత శిక్షణ ఇచ్చి.. వారు పోటీ పరీక్షల్లో నెగ్గే విధంగా తీర్చిదిద్దాం. శిక్షణ పొందిన వాళ్లలో చాలా మంది ఉద్యోగాలు సాధించి ఇప్పుడు పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న వాళ్లూ ఉన్నారు. పోలీసులు చేస్తున్న సేవలను గుర్తించి.. స్కోచ్ అవార్డు ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ ప్రోత్సాహం మరింత బాధ్యతను పెంచింది.
- సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్
సేఫ్ సిటీ ప్రాజెక్టుపై…
సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): సేఫ్ సిటీ ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగాలని ప్రాజెక్ట్ నోడల్ అధికారి, సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అధికారుల బృందానికి సూచించారు. సోమవారం సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌పై రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు మహేశ్‌భగవత్, స్టీఫెన్ రవీంద్ర తదితర అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. అత్యాధునిక టెక్నాలజీ ఉన్న 3,168 కెమెరాలు ప్రాజెక్ట్‌లో భాగంగా ట్రై పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. నగర అదనపు సీపీ శిఖాగోయెల్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

