పచ్చబొట్టు వేసుకోవద్దు!
జీవితంలో జ్ఞాపకాలతో పాటు చెరిగిపోనివి పచ్చబొట్లే. ఒకప్పుడు ముద్దు అనుకున్నవి, ఇప్పుడు వద్దనుకోవచ్చు. అందుకే ఈ పచ్చబొట్లు వేయించుకోకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నది అగ్ర తార సమంత. తాజాగా ఓ లైవ్ ఛాట్‌లో అభిమానులతో మాట్లాడింది సమంత. తన కెరీర్, వ్యక్తిత్వం, నేర్చుకున్న జీవిత పాఠాలు…ఇలా అనేక విషయాలపై సరదాగా ముచ్చటించింది. ఈ సంభాషణ ప్రధానంగా పచ్చ బొట్ల మీద సాగింది. సమంత ఒంటి మీద మూడు టాటూస్ ఉన్నాయి. అవి మాజీ భర్త నాగ చైతన్య, తను నటించిన తొలి సినిమా ఏమాయ చేశావే పేర్లు, మూడోది బాణం గుర్తులు. వీటి గురించి అభిమానులకు వివరించింది సమంత. ఆమె మాట్లాడుతూ…‘మొదటి సినిమా నా జీవితంలో ఎంతో ప్రత్యేకం. నాగ చైతన్యతో పంచుకున్న జీవితం కూడా మంచి జ్ఞాపకం. బాణం గుర్తులు వాస్తవిక జీవితంలో బతకాలని సూచిస్తాయి. మీకొక సలహా ఏంటంటే పచ్చ బొట్లు వేయించుకోకండి’ అని చెప్పింది. నాగ చైతన్యతో వైవాహిక బంధం నుంచి విడిపోయిన తర్వాత నటిగా తన కెరీర్ సాగిస్తున్నది సమంత. ప్రస్తుతం ‘యశోద’, ‘శాకుంతలం’ తదితర చిత్రాల్లో నటిస్తున్నదీ తార.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Samantha
- Shakuntalam
- yashoda
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

