అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’. రాజకీయ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసీఫర్’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుగుతున్నది. చిరంజీవి, సల్మాన్‌ఖాన్ కాంబినేషన్ సన్నివేశాలను తెరకెక్కించిన షెడ్యూల్ సోమవారంతో పూర్తయింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభించనున్నారు. నయనతార నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.