కుమార్ కాసారం హీరోగా నటిస్తున్న చిత్రం ‘సహ’. ‘లైఫ్ ఆఫ్ సంజు’ అనేది ఉపశీర్షిక. శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య కథానాయికలు. నిషాంత్ దోటి దర్శకుడు. తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మిస్తున్నారు. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
గత పదేండ్లలో వచ్చిన సినిమాల్లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని దర్శకుడు నిషాంత్ అన్నారు. హీరో సంజు జీవితంలోని బాల్యం, స్కూల్ డేస్, కాలేజీ, తొలి ప్రేమ, వివాహం.. ఆ తర్వాత చోటుచేసుకున్న భావోద్వేగాలు, మలుపులు ఇలా పలు కీలకమైన దశల్ని ఈ ట్రైలర్ ఆవిష్కరించింది. సంజు జీవితంలోకి ‘సహ’ అనే అమ్మాయి రావడం ఈ ట్రైలర్లో మలుపు. సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్ ఉన్నది. సెప్టెంబర్ 4న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: కె.కరుణాకర్, సంగీతం: శేఖర్‌చంద్ర.