సాథీ 2.0 మొబైల్ యాప్
క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. సోమవారం ‘సాథీ 2.0’ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పర్సనల్ ఫైనాన్స్‌లోని సంక్లిష్ట ఆర్థికాంశాలను సరళతరం చేయడమే లక్ష్యంగా సమగ్ర సాధనాలతో మదుపరుల కోసం ఈ నయా మొబైల్ అప్లికేషన్‌ను సెబీ తీసుకొచ్చింది.
- ఇన్వెస్టర్ల కోసం తెచ్చిన సెబీ
న్యూఢిల్లీ, జూన్ 3: క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. సోమవారం ‘సాథీ 2.0’ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పర్సనల్ ఫైనాన్స్‌లోని సంక్లిష్ట ఆర్థికాంశాలను సరళతరం చేయడమే లక్ష్యంగా సమగ్ర సాధనాలతో మదుపరుల కోసం ఈ నయా మొబైల్ అప్లికేషన్‌ను సెబీ తీసుకొచ్చింది. ‘ఆధునికీకరించిన ‘సాథీ’ యాప్ ఎంతో యూజర్ ఫ్రెండ్లీ’గా ఉంటుందని ఓ ప్రకటనలో సెబీ పేర్కొన్నది. ఇందులో ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్స్, మాడ్యుల్స్ ఉంటాయని, స్టాక్ ఎక్సేంజీల్లో షేర్ల క్రయవిక్రయాలు, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్ లావాదేవీలతోపాటు కేవైసీ నిబంధనల వివరణ వంటివన్నింటినీ పూర్తిస్థాయిలో తెలుసుకోవచ్చని సెబీ ఈ సందర్భంగా చెప్పింది. అంతేగాక మదుపరుల సమస్యలకు పరిష్కార వ్యవస్థ, ఆన్లైన్ డిస్పూట్ రిజల్యూషన్ (ఓడీఆర్) వేదిక కూడా ఉందన్నది. ఇన్వెస్టర్ల పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ కోసం అవగాహనను పెంచే వీడియోలు కూడా ఉంటాయి. కాగా, ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ మొబైల్ వినియోగదారులు ఐవోఎస్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

