న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: దేశవ్యాప్తంగా చలామణీలో ఉన్న పది రూపాయల నాణేలు చట్టబద్ధమైనవేనని, వాటిపై ఎలాంటి నిషేధం లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని రకాల లావాదేవీల కోసం వాటిని వినియోగించవచ్చని తెలిపింది. పది రూపాయల నాణేలు నకిలీవి అని, చెల్లవు అని రకరకాల కారణాలతో దుకాణదారులు, సంస్థలు వాటిని తీసుకోవడం లేదు. దీనిపై రాజ్యసభ సభ్యుడు విజయ్‌కుమార్ పార్లమెంటులో ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై ఆర్బీఐ ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు జారీచేసిందని తెలిపారు. మొత్తం 14 రకాల డిజైన్లలో పది రూపాయల నాణేలను ముద్రించినట్టు ఆర్బీఐ గతంలో వెల్లడించి