అమ్మ ప్రశంసించింది

‘నటుడిగా రజనీకాంత్ నాకు స్ఫూర్తి. ఆయన తరహాలోనే మల్టీప్లెక్స్ నుంచి సింగిల్స్క్రీన్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమాలు చేయాలనుంది’ అని అన్నారు ఆకాష్పూరి. ఆయన హీరోగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. అనిల్ పాదూరి దర్శకుడు. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించారు. సోమవారం ఈ చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకాష్పూరి మాట్లాడుతూ ‘ఈ సినిమా చూసి బాగా నటించానని మా అమ్మ ప్రశంసించింది. ైక్లెమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకుంది. అంతలా కథతో కనెక్ట్ అయ్యింది. నాన్న మాదిరిగా పెద్ద విజయాల్ని నేను అందుకోవాలంటే సమయం పడుతుంది. ఆ స్థాయికి చేరుకోవడం కోసం ఎంతటి కష్టమైనా పడతా’ అని తెలిపారు. మంచి సినిమా ద్వారా తనను దర్శకుడిగా పరిచయం చేసిన పూరి జగన్నాథ్, ఛార్మిలకు జీవితాంతం రుణపడి ఉంటానని అనిల్ పాదూరి అన్నారు. ఈ సినిమా ప్రయాణంలోని ప్రతి రోజును తాను ఎంజాయ్ చేశానని సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కరబట్ల పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

