RGV AI image | అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) అద్భుతాలు అన్నీఇన్నీ కావు. నేటి తరం టెక్ ప్రపంచంలో విపరీతంగా వినిపిస్తున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). ఇది సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. టెక్ రంగంలోనే కాదు.. ఆర్టిస్ట్‌ల ఊహా శక్తికీ కూడా ఏఐ (AI) రెక్కలు తొడుగుతోంది.
ఏఐ టూల్స్‌తో రచయితలు అలవోకగా బుక్స్ రాస్తుండగా ఆర్టిస్టులు సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తమ నైపుణ్యాలకు అద్భుత క్రియేటివిటీ జోడిస్తున్నారు. మిడ్‌జర్నీ వంటి యాప్‌లను ఉపయోగిస్తూ ఇప్పటివరకూ మన ఊహకు సైతం అందని ఇమేజ్‌లను (AI Pics) జనరేట్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV AI Image) కూడా తన ఏఐ చిత్రాన్ని పంచుకున్నారు.
డాన్ గెటప్‌లో ఉన్న రామ్ గోపాల్ వర్మ.. బ్లాక్ షేడ్స్ పెట్టుకుని సిగార్‌తో రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించాడు. “ఐ గాట్ ఏఐ’డీ” అంటూ ట్వీట్టర్లో రాసుకోచ్చారు. అయితే ఈ ఫోటో డిజైన్ చేసిన ఏఐ ఆర్టిస్ట్ ఎవరో వర్మ వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది.
I got AI’d pic.twitter.com/7AB5aJ3CWP
— Ram Gopal Varma (@RGVzoomin) July 26, 2023