ఏదీ దాచిపెట్టలేదు!

బాలీవుడ్ నిర్మాత జాకీభగ్నానీతో తన ప్రేమాయణంలో ఎలాంటి దాపరికాలు లేవని చెబుతున్నది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్‌ప్రీత్‌సింగ్. పరస్పరం ప్రేమ, విశ్వాసం ఉన్నప్పుడు ఏ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంది. గత ఏడాది ఇన్స్టాగ్రామ్ ద్వారా తన లవ్‌ఎఫైర్ గురించి అభిమానులకు చెప్పింది రకుల్‌ప్రీత్‌సింగ్. ఆమె మాట్లాడుతూ ‘మేమిద్దరం పరిశ్రమలో ఉన్నతస్థానంలో ఉన్నాం. ఓ వయసొచ్చాక ప్రేమలో పరిణతి కనబరచాలి. కాలేజీ రోజుల మాదిరిగా అపరిపక్వ ఆలోచనలతో ఉండటం సరికాదు. అందుకే నా ప్రేమ గురించి బాహాటంగా అందరికి తెలియజేశాను. భవిష్యత్తులో మా ఇద్దరి ప్రణాళికల్ని కూడా అభిమానులతో పంచుకుంటా’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. రన్‌వే 34, డాక్టర్ జీ చిత్రాల్లో నటిస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

