ITF | ఈ ఏడాది ఐటీఎఫ్ వరల్డ్ ఛాంపియన్లు.. నాదల్, స్వియటెక్
జకోవిక్ అత్యధికంగా 7 సార్లు ఐటీఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచాడు
ITF : మాజీ వరల్డ్ నంబర్ వన్ రఫెల్ నాదల్ మరోసారి ఐటీఎఫ్ గౌరవం అందుకున్నాడు. పురుషుల విభాగంలో అతను ఈ ఏడాది ఐటీఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌గా ఎంపికయ్యాడు. పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియటెక్ మహిళా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది టెన్నిస్ టోర్నమెంట్లలో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు వీళ్లిద్దరినీ ఐటీఎఫ్ వరల్డ్ ఛాంపియన్లుగా ఎంపిక చేస్తూ అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది. తమను ఈ అరుదైన గౌరవానికి ఎంపిక చేసినందుకు నాదల్, స్వియటెక్ ఐటీఎఫ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
నాదల్ తన కెరీర్లో ఈ గౌరవం పొందడం ఐదోసారి. దాంతో అతను మాజీ ఆటగాడు రోజర్ ఫెదరర్‌తో సమానంగా నిలిచాడు. నొవాక్ జకోవిక్ అత్యధికంగా 7 సార్లు ఐటీఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచాడు. మాజీ ప్లేయర్ పీట్ సాంప్రాస్ ఆరు సార్లు ఈ గౌరవం అందుకున్నాడు. ఈ ఏడాది నాదల్ రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు (ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) గెలిచాడు. దాంతో ప్రస్తుతం అతని ఖాతాలో 22 గ్రాండ్‌స్లామ్స్ ఉన్నాయి. స్వియటెక ఈ సంవత్సరంలో 8 టైటిళ్లు నెగ్గింది. వీటిలో యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీలు ఉన్నాయి. ఈ ఏడాది ఆమె 65 మ్యాచ్‌లు గెలిచింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

