పంజాబ్లో కొత్త జిల్లా ఏర్పాటుపై యోగి విమర్శలు.. తిప్పికొట్టిన అమరిందర్

లక్నో: పంజాబ్ లో ముస్లింలు అధికంగా ఉండే మాలేర్కోట్ల ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ విచ్ఛిన్నకర రాజకీయాలకు ఇది అద్దం పడుతున్నదని అన్నారు. పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ ఈదుల్ ఫితర్ రోజున ఈ కొత్త జిల్లా ఏర్పాటును ప్రకటించారు. మాలేర్కోట్ల పంజాబ్ లో 23 జిల్లా అవుతుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ అని గుర్తు చేశారు. కొత్త జిల్లాకు వైద్య కళాశాలతో సహా పలు ఇతర వరాలు కూడా ప్రకటించారు. అయితే ఇలా మత ప్రాతిపదికన ఎలాంటి చర్యలు తీసుకున్నా అవి భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని యూపీ సీఎం ట్విట్టర్లో విమర్శించారు. దీనిపై పంజాబ్ సీఎం అమరిందర్ కూడా ఘాటుగానే స్పందించారు. పంజాబ్ సంప్రదాయాలేమిటో ఆయనకేం తెలుసు? మాలేర్ కోట్లకు సిక్కుమతంతో గల సంబంధాలు ఆయనకు తెలుసునా? భారత రాజ్యాంగం గురించి ఆయనకు ఏం తెలుసు? యూపీలో రోజూ తన ప్రభుత్వం ద్వారా ఆయన అణగదొక్కేది ఆ రాజ్యాంగాన్నే కదా? అని అమరిందర్ దుయ్యబట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

