Miss Universe | విశ్వసుందరిగా ప్యూర్టో రికో భామ.. మిస్ యూనివర్స్ 2026 విజేతగా నిలిచిన జెన్నిఫర్ బారెటో
Miss Universe | ఈ ఏడాది విశ్వసుందరి కిరీటం ప్యూర్టోరికా భామను వరించింది. స్వదేశీ గడ్డపై జరిగిన 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో జెన్నిఫర్ బారెటో విజేతగా నిలిచింది. గతేడాది మిస్ యూనివర్స్‌గా నిలిచిన మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్.. జెన్నిఫర్‌కు అందాల కిరీటాన్ని అలంకరించారు.
Miss Universe | ఈ ఏడాది విశ్వసుందరి కిరీటం ప్యూర్టోరికా భామను వరించింది. స్వదేశీ గడ్డపై జరిగిన 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో జెన్నిఫర్ బారెటో విజేతగా నిలిచింది. గతేడాది మిస్ యూనివర్స్‌గా నిలిచిన మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్.. జెన్నిఫర్‌కు అందాల కిరీటాన్ని అలంకరించారు.
ఈ అందాల పోటీల్లో డొమినికన్ రిపబ్లిక్కు చెందిన మెలిస్సా నూనెజ్ తొలి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ గోయెట్జ్ రెండో రన్నరప్‌గా నిలిచారు. ఇక ఈ పోటీల్లో భారత్ తరఫున పాల్గొన్న 19 ఏళ్ల కజియా లిజ్ మెజో టాప్ 30 వరకు చేరినా, టాప్ 12లో చోటు దక్కించుకోలేకపోయింది. స్విమ్‌సూట్ రౌండ్ తర్వాత ఎంపికైన 12 మంది ఫైనలిస్టుల్లో భారత్ లేకపోవడంతో ఆమె పోటీ నుంచి నిష్క్రమించింది. దీంతో భారత్ నాలుగో మిస్ యూనివర్స్ కిరీటం కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.
నాయకత్వంపై ప్రశ్న.. ఆకట్టుకున్న జెన్నిఫర్ సమాధానం
చివరి ఐదుగురు పోటీదారుల్లో ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, వెనిజులా, డొమినికన్ రిపబ్లిక్, ప్యూర్టో రికోకు చెందిన అందాల భామలు నిలిచారు. తుది రౌండ్లో వీరందరికీ ఒకే ప్రశ్న అడిగారు. ప్రస్తుతం ప్రపంచానికి నాయకుల నుంచి అత్యంత అవసరమైనది ఏమిటని ప్రశ్నించారు. దీనికి జెన్నిఫర్ బారెటో ఇచ్చిన సమాధానం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. ప్రపంచానికి వృత్తిపరమైన సానుభూతి, ఇతరుల పరిస్థితులను అర్థం చేసుకునే నాయకులు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. నేటి సమాజంలో ఇతరులను తీర్పు చెప్పడం, ప్రశ్నించడం ఎక్కువైందని.. నాయకులు తమ విలువలకు కట్టుబడి, ఆదర్శంగా నిలుస్తూ ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాలని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించినప్పుడే సమర్థవంతమైన మార్పు తీసుకురాగలమని ఆమె వివరించారు.
ప్యూర్టో రికోకు ఆరోసారి కిరీటం
మిస్ యూనివర్స్ చరిత్రలో ప్యూర్టో రికోకు ఇది ఆరో విజయం. గతంలో ఈ దేశానికి చెందిన పలువురు అందాల భామలు ప్రపంచ కిరీటాన్ని దక్కించుకున్నారు. 1970లో మారిసోల్ మలరెట్, 1985 – డెబోరా కార్తీ-డియో, 1993లో దయనారా టోరెస్, 2001లో డెనిస్ క్వినోన్స్, 2006లో జులైకా రివెరా, 2026లో జెన్నిఫర్ బారెటో విశ్వ సుందరిగా నిలిచారు. కాగా ప్యూర్టో రికో వేదికపై రెండోసారి మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకోవడం కూడా ఈసారి ప్రత్యేకత. 2001లో డెనిస్ క్వినోన్స్ విజేతగా నిలిచినప్పుడు కూడా ఈ దేశమే పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Miss Universe | విశ్వసుందరిగా ప్యూర్టో రికో భామ.. మిస్ యూనివర్స్ 2026 విజేతగా నిలిచిన జెన్నిఫర్ బారెటో
Bandla Ganesh | బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఫిర్యాదుదారుడి కీలక ప్రకటనతో ఊరట!
Pakistan Astronaut | చైనా నుంచి తొలిసారిగా అంతరిక్షంలోకి పాక్ వ్యోమగామి.. 40 ఏళ్ల క్రితమే చరిత్ర సృష్టించిన భారత్!
Mississippi Plane Crash | మిస్సిసిపీ తీరంలో కూలిన విమాన ప్రమాదం.. ఆరుగురు గల్లంతు
Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ ‘ఈథా’పై నెట్టింట విమర్శలు.. డైలాగ్ డెలివరీపై నెటిజన్ల అసంతృప్తి!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

