Lionel Messi | పీఎస్జీ క్లబ్‌కు షాక్.. మెస్సీ వైదొలగడంతో భారీగా తగ్గిన ఇన్‌స్టా ఫ్యాన్స్
Lionel Messi : అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ(Lionel Messi) పీఎస్జీ(పారిస్ సెయింట్ జర్మనీ) క్లబ్‌ను వీడిన సంగతి తెలిసిందే. అయితే... పోతూ పోతూ ఆ క్లబ్‌ను దెబ్బ కొట్టాడు. ఎలాగంటే.. మెస్సీ తప్పుకోవడంతో పీఎస్జీ క్లబ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య భారీగా తగ్గింది. 10 లక్షల మంది ఫాలోవర్లు....
Lionel Messi : అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ(Lionel Messi) పీఎస్జీ(పారిస్ సెయింట్ జర్మనీ) క్లబ్‌ను వీడిన సంగతి తెలిసిందే. అయితే… పోతూ పోతూ ఆ క్లబ్‌ను దెబ్బ కొట్టాడు. ఎలాగంటే.. మెస్సీ తప్పుకోవడంతో పీఎస్జీ క్లబ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య భారీగా తగ్గింది. 10 లక్షల మంది ఫాలోవర్లు ఆ క్లబ్‌ను వీడారు. మెస్సీ ఉన్నప్పుడు పీఎస్జీ క్లబ్ ఫాలోవర్ల సంఖ్య 69.9 మిలియన్లు. ప్రస్తుతం ఆ సంఖ్య 68.5కి చేరింది. దాంతో, పీఎస్జీ షాక్ తిన్నది.
మెస్సీ పీఎస్జీ తరఫున జూన్ 3 శనివారం ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. క్లెర్మంట్ ఫుట్(Clermont Foot) క్లబ్‌తో మెస్సీ తలపడ్డాడు. ఈ వరల్డ్ కప్ హీరో వచ్చే సీజన్లో సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్(Al-Hilal) క్లబ్‌కు ఆడనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తనకు అల్ హిలాల్ క్లబ్ నుంచి ఆఫర్ వచ్చిందని మెస్సీ రైటర్స్ వార్తా సంస్థతో చెప్పాడు. అయితే.. కాంట్రాక్టు కుదిరిందా? లేదా? అనే విషయం గురించి మెస్సీగానీ, అల్ హయతి క్లబ్గానీ అధికారికంగా వెల్లడించలేదు.
రెండేళ్లు .. 21 గోల్స్
ఫుట్‌బాల్ లెజెండ్ అయిన మెస్సీ ఏడుసార్లు బాలెన్ డిఓర్ అవార్డ్ గెలిచాడు. అతను 21 ఏళ్ల పాటు బార్సిలోనా() క్లబ్‌కు ఆడాడు. అయితే.. ఆ క్లబ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో అతను 2021లో పీఎస్జీతో ఒప్పందం చేసుకున్నాడు. రెండేళ్లు ఈ క్లబ్ తరఫున 21 గోల్స్ కొట్టాడు. మరో 20 గోల్స్ చేయడంలో సహచరులకు సాయం అందించాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న మెస్సీ గత ఏడాది ఖతర్‌లో అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్ కప్ అందించాడు. ఉత్కంఠ రేపిన ఫైనల్లో 4-2తో షూటౌట్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా గెలుపొందింది. దాంతో మూడోసారి చాంపియన్‌గా అవతరించింది.
వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడుతున్న మెస్సీ

ఇవి కూడా చదవండి
Aaron Finch | ఫైనల్లో జడేజా బంతితో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు : ఆసీస్ మాజీ కెప్టెన్
MS Dhoni | ఎయిర్‌పోర్ట్‌లో ధోనీ.. మహీ ఫ్యామిలీతో మాజీ ఆటగాడి ఫొటోలు వైరల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

