తెలంగాణ రైతు వెంకట్‌రెడ్డికి ప్రధాని మోదీ ప్రశంసలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు చెందిన రైతు శాస్త్రవేత్త చింతల వెంకట్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. మన్ కీ బాత్ 74వ ఎడిషన్‌లో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో మాట్లాడిన ప్రధాని.. సైన్స్‌ను ఆధారంగా చేసుకుని హైదరాబాద్‌కు చెందిన చింతల వెంకట్‌రెడ్డి వ్యవసాయ రంగంలో అద్భుత విజయాలు సాధించారని చెప్పారు. ఆయన సేంద్రియ ఎరువులను ఉపయోగించి ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారని ప్రధాని కొనియాడారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం చింతల వెంకట్‌రెడ్డిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని ప్రధాని గుర్తుచేశారు.
కాగా, తెలంగాణకు చెందిన రైతు శాస్త్రవేత్త అయిన చింతల వెంకటరెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అల్వాల్‌కు చెందిన ప్రముఖ ద్రాక్ష రైతు. ఆయన సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసే బియ్యం, గోధుమల్లో డీ విటమిన్ అధిక మొత్తంలో ఉండేలా ఓ వినూత్న ఫార్ములాను రూపొందించారు. తన ఫార్ములాపై ఇంటర్నేషనల్ పేటెంట్ కోసం గత ఏడాది అప్లై చేయగా, తాజాగా నోటిఫికేషన్ వచ్చింది. పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ (పీసీటీ) ధ్రువీకరణ ఇచ్చింది. దాంతో అతని ఫార్ములాపై 130 దేశాల పేటెంట్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకొని జాతీయస్థాయి పేటెంట్ హక్కులు పొందే అవకాశం లభించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

