Prabhas | ప్రాజెక్ట్-K నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..
Projec-K Movie | రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ప్రాజెక్ట్-K గ్లింప్స్ పై అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ఇప్పటివరకు అసలు సినిమా గురించి ఎలాంటి క్లూ గానీ, ఇన్ఫర్మేషన్ గానీ లేదు. కాగా గ్లింప్స్ రిలీజైతే గానీ అసలు ప్రాజెక్ట్-k వెనకున్న మిస్టరీకి తెరపడుతుంది.
Projec-K Movie | ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందుతున్న సినిమా ప్రాజెక్ట్-K. ఈ సినిమా బడ్జెట్ ఆరోందల కోట్లకు పైమాటే అని తెలుస్తుంది. రాను రాను ఈ నెంబర్ పెరుగుతుండచ్చు అన్నది కూడా ఓ సమాచారం. ముందు నుంచి మేకర్స్ ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో అవేంజర్స్ తరహాలో రూపొందిస్తున్నట్లు ప్రచారం చేస్తూనే వస్తున్నారు. దానికి తగ్గట్లే ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్‌కు తీసుకెళ్లడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరో రెండు రోజుల్లో ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ కానుంది.
ఈ నెల 20న శాండియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ‘ప్రాజెక్ట్-కె’ టైటిల్‌తో పాటు చిత్ర ట్రైలర్, విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. ఒక భారతీయ సినిమా అంతర్జాతీయ స్థాయిలో కామిక్ కాన్‌లో తొలిసారి ఎంట్రీ ఇవ్వడం అనేది ప్రభాస్ అభిమానులనే కాదు టాలీవుడ్ సినీ ప్రియులందరనీ తీవ్ర ఎగ్జైట్మెంట్కు గురి చేస్తుంది. ఎందరో మహామహులకు సాధ్యం కానీ ఈ ఫీట్‌ను తెలుగు టీమ్ సాధించడం నిజంగా గొప్ప విషయమే. మార్వెల్, డీసీ లాంటి సంస్థలు వాళ్ల సినిమాలను ఇక్కడే ప్రమోట్ చేసుకుంటారు. ఇక ఇప్పుడు ఇదే వేదికపై ఒక తెలుగు సినిమా ప్రమోషన్లు స్టార్ట్ చేయబోతుందంటే మాములు విషయం కాదు.
గ్లింప్స్ వచ్చేలోపే మేకర్స్ డార్లింగ్ అభిమానులను ఖుషీ చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ లు ప్రకటిస్తున్నారు. ఇక ఎప్పుడెప్పుడా అని అభిమానులు రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ప్రభాస్ పోస్టర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.
ఇటీవలే రిలీజైన దీపికా పోస్టర్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. అంత కాస్ట్ లీ, క్వాలీటీ సినిమా నుంచి అలాంటి పోస్టర్ ను అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేమని సినీ లవర్స్ అభిప్రాయపడ్డారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే, దిశా పటానీ నటిస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీదత్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సంక్రాంతికి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నా.. షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉండటంతో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి


