296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం
జలౌన్: యూపీలోని బుందేల్‌ఖండ్‌లో సుమారు 296 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. యూపీలోని ఏడు జిల్లాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. సుమారు 14,850 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు. జలౌన్ జిల్లాలోని కైథేరి గ్రామంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిబ్రవరి 29, 2020లో ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. కేవలం 28 నెలల్లోనే ఈ హైవేను నిర్మించారు. చిత్రకూట్ జిల్లాలోని గోండా గ్రామం వద్ద ఎన్‌హెచ్-35తో ఈ హైవే కలుస్తుంది. ఆ తర్వాత ఇటావా జిల్లాలోని కుద్రాలి గ్రామం వరకు ఎక్స్‌ప్రెస్ వే ఉంటుంది. అక్కడ ఆగ్ర-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేతో కలుస్తుంది. తొలుత దీన్ని ఫోర్‌లేన్ రూట్‌గా నిర్మించారు. తర్వాత సిక్స్ లేన్స్‌గా మార్చే అవకాశం ఉంది. చిత్రకూట్, బాండా, మహోబా, హమిర్పూర్, జలౌన్, ఔరయా, ఇటావా జిల్లాల మీదుగా ఈ ఎక్స్‌ప్రెస్‌వే వెళ్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

