క్షార ద్రావణాల్లో ఫినాఫ్తలిన్ సూచిక రంగు?ఆమ్లాలు-క్షారాలు
- కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగులో మార్పును సూచిస్తాయి. అలాంటి పదార్థాలను ‘సూచికలు’ అని అంటారు.
- పసుపు పూసిన కాగితం ఒక ‘సమాజ సూచిక’ మందారపువ్వులు, మామిడి ఆకులు, బీట్రూట్ గన్నేరు పూల రసాల నుంచి కూడా సహజ సూచికలను తయారు చేయవచ్చు.
- లిట్మస్, లైకేన్ అనే థాలోఫైటా వర్గానికి చెందిన మొక్కల నుంచి సేకరించిన రంజనం తటస్థ ద్రావణంలో లిట్మస్ రంగు ముదురు ఊదారంగు.
- హైడ్రాంజియా, పిటూనియా, జిరేనియం వంటి మొక్కల రంగు పూల ఆకర్షక పత్రాలను కూడా సూచికలుగా ఉపయోగిస్తారు.
ఆమ్లాలు - నీలి లిట్మస్‌ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలను ‘ఆమ్లాలు’ అని అంటారు.
- ఇవి రుచికి పుల్లగా ఉంటాయి.
- జంతువులు, మొక్కల్లో ఉండే ఆమ్లాలను సహజ ఆమ్లాలు అని అంటారు.
- చీమ కుట్టినప్పుడు మంటగా అనిపించడానికి కారణం అది విడుదల చేసే ఫార్మిక్ ఆమ్లం.
- ఆమ్లాలు మిథైల్ ఆరెంజ్ సూచిక లేదా మందార పూల రసాన్ని ఎరుపు రంగులోకి మారుస్తాయి.
- ఫినాఫ్తలిన్ ఆమ్లాలతో రంగులేకుండా ఉంటుంది.
కొన్ని ఆమ్లాలు అవి ఉండే పదార్థాలు
- ఎసిటిక్ ఆమ్లం- వెనిగర్
- ఓలిక్ ఆమ్లం- ఆలివ్ ఆయిల్
- సిట్రిక్ ఆమ్లం- నిమ్మ, నారింజ
- స్టీరిక్ ఆమ్లం- కొవ్వు పదార్థాలు
- బ్యుటిరిక్ ఆమ్లం- వెన్న
- టార్టారిక్ ఆమ్లం- ద్రాక్ష, చింతపండు
- లాక్టిక్ ఆమ్లం- మజ్జిగ, పెరుగు
- పామాటిక్ ఆమ్లం- పామాయిల్
- ఆగ్జాలిక్ ఆమ్లం- పాలకూర, టమాట
- ఎస్కార్టిక్ ఆమ్లం- ఉసిరిమాలిక్ ఆమ్లం- ఆపిల్
- ఆమ్లం- మూత్రం
- సహజ ఆమ్లాలతో పాటు కొన్ని రసాయన ఆమ్లాలు ఉన్నాయి. ఉదా: సల్ఫ్యూరిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నత్రికామ్లం
- లాలాజలం, దోసకాయ, శీతల పానీయాలు వంటివి ఆమ్లాలను కలిగి ఉంటాయి.
- రాగి పాత్రలో ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు పాత్ర లోపల నీలి ఆకుపచ్చ పొరలు ఏర్పడుతాయి. నిల్వ ఉంచిన పదార్థాల్లో ఉన్న ఆమ్లం రాగితో చర్య జరిపి నీలి ఆకుపచ్చ పొరలను ఏర్పరుస్తుంది.
- దీనిని నివారించడానికి ‘తగరపు పూత’ పూస్తారు.
- పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలైన CO2, SO2, NO2 వంటివి వాతావరణంలోని తేమతో చర్య జరిపి ఆమ్లాలను ఏర్పరుస్తాయి. ఇవి వర్షపు నీటితో కలిసి ఆమ్లవర్షాలుగా పడుతాయి.
- ఆమ్ల వర్షాల వల్ల తాజ్‌మహల్ వంటి కట్టడాలకు హాని కలుగుతుంది.
- పచ్చళ్ల తయారీలో- ఎసిటిక్ ఆమ్లం
- పులిహోర తయారీలో- సిట్రిక్ ఆమ్లం
- శీతల పానీయాల తయారీలో- కార్బోనిక్ ఆమ్లం
- సిరామరకలను తొలగించడానికి- ఆగ్జాలిక్ ఆమ్లం
- ఎరువుల తయారీ, బ్యాటరీల్లో- సల్ఫ్యూరిక్ ఆమ్లం
- మందులు, రంగుల తయారీలో- హైడ్రోక్లోరిక్ ఆమ్లం
- పేలుడు పదార్థాల తయారీలో- నత్రికామ్లం ఉపయోగిస్తారు.
- కొన్ని సూచికలు ఆమ్ల, క్షార యానకంలో వేర్వేరు వాసనలను ప్రదర్శిస్తాయి. వీటిని సువాసన సూచికలు అంటారు. ఉదా: ఉల్లిపాయలు, వెనీలా, సుగంధ ద్రవ్యం, లవంగ నూనె
- ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి.2Hcl+Zn -> Zncl2 + H2
ఆమ్లాలను కార్బొనేట్లు, బైకార్బొనేట్లతో చర్య జరిపినప్పుడు CO2, లవణాలను ఏర్పరుస్తాయి.Na2 CO3 +2Hcl -> 2Nacl + H2O + CO2 - ఆమ్లాలు లోహ ఆక్సైడ్లతో చర్య జరిపి లవణం, నీరును ఏర్పరుస్తాయి.Na2O + 2Hcl -> 2Nacl + H2O
- విలీన ఆమ్లం తయారు చేసేటప్పుడు నీటికి నెమ్మదిగా ఆమ్లాన్ని కలపాలి క్షారాలు
- ఎరుపు లిట్మస్‌ను నీలి లిట్మస్‌గా మార్చే మృదు స్పర్శ కలిగిన పదార్థాలను ‘క్షారాలు’ అని అంటారు.
- జారుడు స్వభావం ఉన్న పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది. ఉదా: సబ్బునీరు- కాల్షియం హైడ్రాక్సైడ్
- సబ్బు- సోడియం/పొటాషియం హైడ్రాక్సైడ్
- గాజు శుభ్రపరిచే ద్రవాలు- అమ్మోనియం హైడ్రాక్సైడ్
- మిల్క్ ఆఫ్ మెగ్నీషియం- మెగ్నీషియం హైడ్రాక్సైడ్
- హైడ్రాక్సైడ్లకు క్షార స్వభావం ఉటుంది.
- క్షార ద్రావణం మిథైల్ ఆరంజి సూచికను పసుపు రంగులోకి మారుస్తుంది.
- ఫినాఫ్తలిన్తో క్షార ద్రావణం ఊదారంగులోకి మారుతుంది. బట్టల సోడా, తినే సోడా, కాస్టిక్ సోడా వంటివి క్షారాలు
- ఆమ్ల ద్రావణం కంటే ఎక్కువ పరిమాణంలో క్షార ద్రావణం కలిపినప్పుడు ఆ ద్రావణం క్షార ధర్మాన్ని పొందుతుంది.
PH స్కేలు - ద్రావణంలోని హైడ్రోజన్ అయాన్ గాఢతను లెక్కించడానికి వాడే స్కేలును PH స్కేలు అని అంటారు.
- PHలో P అనే అక్షరం ‘పొటెన్జ్’ అనే జర్మన్ పదాన్ని సూచిస్తుంది. జర్మన్ భాషలో పొటెన్జ్ అంటే సామర్థ్యం అని అర్థం.
- PH విలువ దాని ఆమ్ల, క్షార స్వభావాన్ని సూచించడానికి ఉపయోగించే సంఖ్య మాత్రమే.
- తటస్థ ద్రావణ PH – 7
- PH స్కేలుపై 7 కంటే తక్కువ విలువ కలిగిన ద్రావణాలు ‘ఆమ్ల ద్రావణాలు’
- 7 కంటే ఎక్కువ అంటే 7-14 వరకు పెరుగుతుంటే HO+ అయాన్ల గాఢత తగ్గడం, OH- అయాన్ల గాఢత పెరగడం జరుగుతుంది.
- PH విలువ 7 కంటే ఎక్కువగా ఉండే ద్రావణాలు ‘క్షార ద్రావణాలు’.
- ఒక ఆమ్లం లేదా క్షార బలం ద్రావణం రూపంలో ఉన్నప్పుడు వానిలో H3O+ లేదా OH- అయాన్ల గాఢతపై ఆధారపడుతుంది.
- PH విలువను ప్రవేశపెట్టినవారు- సోరెన్సన్
- PH స్నేలు విలువ 0-14 వరకు ఉంటుంది.
- నీటి అయానిక లబ్దం = (H+) (OH-)= 10-14 (గది ఉష్ణోగ్రత వద్ద)
= 10-14 మోల్‌లు - వర్షపు నీటి PH విలువ 5.6 కంటే తక్కువయితే దానిని ఆమ్ల వర్షం అంటారు.
- PH విలువ 5.5 కంటే తక్కువయినప్పుడు దంతక్షయం ప్రారంభమవుతుంది. నోటిలో ఉన్న బ్యాక్టీరియాలు దంతాల మధ్య చిక్కుకొని ఉన్న చక్కెర వంటి ఆహార కణాలను వియోగం చెందించి ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి.
- జీర్ణక్రియలో మన జీర్ణాశయం Hclను విడుదల చేస్తుంది.
- ఇది మనం తిన్న ఆహారం జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంది.
- అజీర్తి సందర్భంలో మన జీర్ణాశయం అధిక పరిమాణంలో ఆమ్లాలను ఉత్పత్తి చేయడం ద్వారా కడుపులో మంట, అసహనం కలుగుతాయి.
- దీని నుంచి విముక్తి పొందడానికి ఏంటాసిడ్లు ఉపయోగిస్తాం.
- సాధారణంగా ఏంటాసిడ్గా మిల్క్ ఆఫ్ మెగ్నీషియం {Mg(OH2)}ను ఉపయోగిస్తారు.
- పెరడులో మొక్కలు ఆరోగ్యవంతంగా పెరగడానికి నిర్దిష్ట పరిమితిలో PH అవసరం.
- తేలు కుట్టినప్పుడు తీవ్రమైన నొప్పి, దురద కలుగుతాయి. దీనిపై బేకింగ్ సోడా పూయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
- కీటకం నుంచి మిథనోయిక్ ఆమ్లం (ఫార్మిక్ ఆమ్లం), ఆకులపై ముండ్లు ఉండే దూలగొండి మొక్క గుచ్చుకున్నప్పుడు ‘మిథనోయిల్ ఆమ్లాన్ని’ శరీరంలోకి పంపి తీవ్ర మంట, దురద కలుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ‘దుష్టిపాకు (డాక్ ప్లాంట్) ఆకులతో కుట్టిన ప్రదేశంలో రుద్దితే ఉపశమనం కలుగుతుంది.
ప్రాక్టీస్ బిట్స్
1. ఆమ్ల ద్రావణాల్లో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు?
1) పసుపు 2) ఆకుపచ్చ
3) ఆరెంజ్ 4) ఎరుపు
2. క్షార ద్రావణాల్లో ఫినాఫ్తలిన్ సూచిక రంగు?
1) పసుపు 2) ఆకుపచ్చ
3) గులాబి 4) ఆరెంజ్
3. క్షార స్థితిలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు?
1) ఆరెంజ్ 2) ఆకుపచ్చ
3) ఎరుపు 4) నీలి రంగు
4. ఒక ద్రావణం ఎరుపు లిట్మస్‌ను నీలి రంగులోకి మార్చింది. దాని PH విలువ?
1) 1 2) 4 2) 5 4) 10
5. ఒక ద్రావణం పగిలిన కోడిగుడ్డు పొట్టుతో చర్చ జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు సున్నపుతేటను పాల వలే మార్చింది. ఆ ద్రావణం దేనిని కలిగి ఉంటుంది?
1) Nacl 2) Hcl 3) Licl 4) Kcl
6. నీటిలో కరిగే క్షారాలను ఎలా పిలుస్తారు?
1) తటస్థ 2) క్షార
3) ఆమ్ల 4) క్షారయుత
7. హైడ్రోక్లోరిక్ ఆమ్లం సార్వత్రిక PH సూచికలో ఏర్పడే రంగు (PH=1)?
1) ఆరెంజ్ 2) ఊదా
3) పసుపు 4) ఎరుపు
8. కింది వాటిలో ఏ మందును అజీర్ణానికి ఉపయోగిస్తారు?
1) యాంటీబయాటిక్ 2)ఎనాలిజ్టిల్
3) ఏంటాసిడ్ 4) యాంటీసెప్టిక్
9. మెగ్నీషియం లోహం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం మధ్య చర్య వల్ల ఏర్పడే వాయువు?
1) హైడ్రోజన్ 2) ఆక్సిజన్
3) CO2 4) క్లోరిన్
10. జీర్ణాశయంలో ఏర్పడే ఆమ్లం?
1) Hcl 2) H2SO4
3) CH3COOH 4) Hno3
11. చాలా లవణాలు వాతావరణం నుంచి నీటిని శోషిస్తాయి.
ఈ పద్ధతిని ఏమంటారు?
1) స్ఫటికీకరణం 2) డీ హైడ్రేషన్
3) బాష్పీభవనం 4) ద్రవీకరణం
12. కింది వాటిలో విరంజనకారిగా ఉపయోగించేది?
1) CaOcl2 2) Na2S2O3
3) Na2SO4 4) CuSO4
13. H2O + – -> H3O+
1) H+ 2) OH-
3) H2O 4) H3O+
పుస్తక సమీక్ష బీఎస్ఎఫ్, ఈఎస్ఐ బుక్స్
- బీఎస్ఎఫ్ కానిస్టేబుల్, ఈఎస్ఐ పోస్టుల భర్తీకి నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌కు సంబంధించి బుక్స్‌ను విజేత కాంపిటీషన్స్ విడుదల చేసింది.
- రెండు పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా నిపుణులతో ఈ పుస్తకాలను రూపొందించారు. తక్కువ సమయంలో పరీక్ష పై అవగాహన వచ్చే విధంగా ఈ బుక్స్ ఉన్నాయి. వీటితోపాటు భారత ఆర్థిక సర్వే, విదుర నీతి, కణిక నీతి పుస్తకాలను కూడా విజేత కాంపిటీషన్స్ విడుదల చేసింది. పుస్తకాలు అన్ని బుక్ సెంటర్లలో లభిస్తాయి. బీఎస్ఎఫ్ బుక్ పేజీలు: 528, ధర రూ.399, ఆర్థిక సర్వే రూ.199.
- పుస్తకాలు, పూర్తి వివరాల కోసం బండ్ల పబ్లికేషన్స్, బతుకమ్మకుంట, బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్. 040-27429494, 9963293399లో సంప్రదించవచ్చు.
పీ ఢిల్లీ బాబుఏకేఆర్ స్టడీ సర్కిల్వికారాబాద్
Answers
1-4, 2-3, 3-2, 4-4, 5-2,
6-4, 7-4, 8-3, 9-1, 10-1, 11-4, 12-1, 13-1
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
Jailer 2 | ఓటీటీ వివాదం.. ఆ మల్టీప్లెక్స్‌లలో ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు నో ఎంట్రీ!
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

