‘పెళ్లి సందD’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఫ్లాప్ టాక్‌తో సర్ప్రైజింగ్ కలెక్షన్స్..
Pelli SandaD Surprising Collections in First Weekend | బాక్సాఫీస్ దగ్గర కొన్ని సార్లు అలాంటి మ్యాజిక్ జరుగుతుంది. ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలు సైతం ఒక్కోసారి మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. ఇప్పుడు శ్రీకాంత్ తనయుడు

బాక్సాఫీస్ దగ్గర కొన్ని సార్లు అలాంటి మ్యాజిక్ జరుగుతుంది. ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలు సైతం ఒక్కోసారి మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. ఇప్పుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. అప్పట్లో శ్రీకాంత్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా పెళ్లి సందడి. పాతికేళ్ళ తర్వాత ఇదే టైటిల్‌తో ఆయన తనయుడు సినిమా చేసాడు. నాలుగేళ్ల కిందే నిర్మల కాన్వెంట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా అది సరదాగా చేసిన సినిమానే. ఇప్పుడు పూర్తిస్థాయిలో లాంఛ్ అయ్యాడు రోషన్. మంచి అంచనాలతోనే వచ్చిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. పెళ్లి సందడిలో పిల్ల సందడి మాత్రమే కనిపించిందటూ సెటైర్లు వేస్తున్నారు ప్రేక్షకులు. హీరోయిన్ ఓవరాక్షన్ కు తోడు.. సినిమా కథ కూడా పూర్తిగా ఓల్డ్ ఫార్మాట్ లోనే సాగిందని చెప్తున్నారు విశ్లేషకులు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా వస్తుంది. గౌరీ రోనంకీ దర్శకురాలు. ట్రైలర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టాక్ ఎంత బ్యాడ్ గా ఉన్నా కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. ఫస్ట్ వీకెండ్ నాటికి చాలా చోట్ల సినిమా సేఫ్ జోన్ కు రావడం ట్రేడ్‌కు కూడా సర్ప్రైజింగ్గా మారింది.
నైజాం: 1.25 కోట్లు
సీడెడ్: 0.88 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.48 కోట్లు
ఈస్ట్: 0.23 కోట్లు
వెస్ట్: 0.21 కోట్లు
గుంటూరు: 0.37 కోట్లు
కృష్ణా: 0.24 కోట్లు
నెల్లూరు: 0.19 కోట్లు
ఏపీ + తెలంగాణ: 385 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.21 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్: 4.06 కోట్లు షేర్
‘పెళ్ళి సందD’ చిత్రానికి రూ.7.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే, నిర్మాతలు చాలా చోట్ల స్వయంగా రిలీజ్ చేసుకున్నారు. అందుకే కేవలం రూ.5.15 కోట్లు వస్తే చాలు సినిమా సేఫ్ జోన్‌కు వచ్చేసినట్లే. అంటే మరో కోటి రూపాయల దూరంలోనే ఉంది పెళ్లి సందD. ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం చూస్తే కష్టమే కానీ పాత పెళ్లి సందడిని దృష్టిలో పెట్టుకుని దీనికి బాగానే వచ్చారు. ఇదే జోరు కంటిన్యూ అయితే రోషన్ హిట్ కొట్టినట్లే. ఇది నిజంగానే ట్రేడ్ పండితులకు కూడా అర్థం కాని విషయం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

