నువ్వు పట్టుచీర కడితే పుత్తడి బొమ్మా.. ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ – అంటాడో భావుకుడు. నిజమే,
సంప్రదాయ పట్టువస్ర్తాలను ఇష్టపడనివారు ఎవరుంటారు? పండుగలు, పెండ్లిళ్ల వంటి శుభాకార్యాల్లోనూ వీటిదే హవా.
పట్టుబట్టలంటే చీరలు, ఓణీలే కాదు.. నేటి తరానికి నచ్చే సరికొత్త డిజైన్లూ మార్కెట్లోకి వచ్చాయి. ఆధునిక సొబగులు అద్దుకున్న ఆ పట్టు డిజైన్లేవో చూద్దాం..
పట్టులంగా జాకెట్టు.. పాత ఫ్యాషనే అయినా ఇప్పటికీ మహిళల మనసును దోచేస్తున్నది. అందుకే, లంగా జాకెట్టునే కాస్త భిన్నంగా డిజైన్ చేశారు. లెహంగా కోసం చేనేత బ్రౌన్ కలర్ పట్టు ఫ్యాబ్రిక్‌కు బంగారు వన్నె బార్డర్ జతచేశారు. లెహంగా నిండుగా కనిపించేందుకు దగ్గరదగ్గరగా ప్రిల్స్ ఇచ్చారు. అదే రంగు పట్టు ఫ్యాబ్రిక్‌తో టాప్ ఇచ్చారు. క్రాస్‌కట్ నెక్‌తో స్లీవ్‌లెస్ ఇచ్చి బార్డర్‌తో ప్లీట్స్ జతచేశారు. కట్స్‌తోపాటు పొట్లీ బటన్స్ జతచేయడంతో ట్రెండీలుక్ వచ్చింది. సంప్రదాయానికి ఫ్యాషన్ తోడైంది.
నీలం, ఎర్ర రంగు చేనేత పట్టు ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన డిజైన్ ఇది. లెహంగాను హైలైట్ చేయడానికి కెన్కెన్ జతచేశారు. నీలం రంగు ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌కు ఎర్ర రంగు లాంగ్ బార్డర్ ఇచ్చి ప్రిల్స్ జోడించారు. లెహంగాకు నప్పేలా అదే రంగులో లాంగ్ టాప్ ఇచ్చారు. యోక్ పార్ట్‌లో.. క్రాస్ కట్లో పైన బార్డర్ జతచేసి కొనసాగింపుగా ఆర్మ్ లెన్త్ హ్యాండ్స్ ఇచ్చి లెహంగా కలర్ ప్లీట్స్ జతచేశారు. ఎడమ భుజంపై నీలం ఫ్యాబ్రిక్ కట్ .. పైటను తలపించేలా ఉంది.
నిహారికా రెడ్డి నిహారికా డిజైన్ స్టూడియో,
ఫోన్ :8008322377.
Follow us on Instagram. Com/niharikareddy.official