దయనీయ స్థితిలో ఉన్నాం.. దాతృత్వం చూపరూ: బ్రిటన్కు నేపాల్ ప్రధాని అభ్యర్థన

కఠ్మాండూ: గార్డియన్ పత్రిక ఒపీనియన్ కాలమ్ కు రాసిన లేఖలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి అత్యంత దయార్ద్రమైన రీతిలో బ్రిటన్ సాయాన్ని అభ్యర్థించారు. ప్రస్తుతం నేపాల్లో కోవిడ్ కేసులు మరణాలు పెరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మొదటి నుంచీ కష్టాలు, పోరాటాలకు అలవాటు పడ్డ నేపాల్ ఇప్పుడు దయనీయ స్థితిలో ఉందని పేర్కొన్నారు. బ్రిటన్, నేపాల్ వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ రెండింటి మధ్య చిరకాల మైత్రి ఉందని, ప్రజల మధ్య లోతైన అనుబంధాలున్నాయని గుర్తు చేశారు. హిమాలయాలు అధిరోహించేవారికి ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసిన షేర్పాలు ప్రస్తుతం ఊపిరి ఆడక సతమతం అవుతున్నారని తెలిపారు. ప్రస్తుతం నేపాల్ దగ్గర సాధన సంపత్తి, నిధుల లేమి వల్ల నేపాల్ పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. ఈ మహమ్మారి ధనిక, పేద తేడాలను మరోసారి ముందుకు తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు, చికిత్స, టీకాలు ప్రపంచంలోని ప్రతిఒక్కరికీ అందుబాటులోకి వచ్చేలా చూస్తేనే మహమ్మారిని అంతం చేయొచ్చని తెలిపారు. పేదదేశాల్లోని వందల కోట్ల మందికి టీకా ఎప్పుడు లభిస్తుందో తెలియదని వివరించారు. బ్రిటన్ నుంచి సాయాన్ని నేపాల్ ఆశిస్తున్నదని తెలిపారు. జీ-7 గ్రూప్ అధ్యక్ష స్థానంలో ఉన్న బ్రిటన్ తాను సాయం అందించడమే కాకుండా సంపన్న దేశాల నుంచి సాయం అందేలా చూడాలని కోరారు. ప్రస్తుత కలగాపులగపు ప్రపంచం అందరూ క్షేమంగా ఉంటేనే ముందుకు సాగగలదని గుర్తు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Britain
- KP Sharma Oli
- Nepal PM
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

