ఎట్టకేలకు నిశ్చితార్థం జరుపుకున్న నయనతార.. పిక్ వైరల్

కోలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ అంటే ఠక్కున గుర్తొచ్చేది నయనతార- విఘ్నేష్ శివన్ జంట. 2015లో వచ్చిన ‘నానుమ్ రౌడీదాన్’ సినిమా సమయంలో నయన్, విఘ్నేష్‌లు ప్రేమలో పడగా, అప్పటి నుండి వీరిద్దరు డేటింగ్లో ఉన్నారు. ఖాళీ సమయాలలో చెట్టాపట్టాలు వేయడం, పండుగుల, పార్టీలు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తూ వస్తున్నారు. ఇక పెళ్లెప్పుడు చేసుకుంటారా అని అందరు కళ్లప్పగించి చూస్తున్న సమయంలో నయన్- విఘ్నేష్ శివన్ జంట సీక్రెట్‌గా నిశ్చితార్థం జరుపుకున్నారనే టాక్ వినిపిస్తుంది.
నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ తన ఇన్‌స్టాగ్రాములో నయన్‌ని హత్తుకొని దిగిన ఫొటోని షేర్ చేయగా, ఇందులో నయన తార చేతికి ఉంగరం ఉండడాన్ని గమనించారు నెటిజన్స్ . ఇంకేముంది ఇద్దరికి నిశ్చితార్థం జరిగిందని అంటున్నారు. అతి త్వరలో పెళ్లి పీటలెక్కడం కూడా ఖాయం అని చెబుతున్నారు. విఘ్నేశ్ ప్రస్తుతం కాతువాక్కుల రెండు కాదల్ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి, నయనతార, సమంత అక్కినేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

