గంపెడు టమాటల కోసం ఘర్షణ.. 20 మంది మృతి..!

నైజీరియా : ఫలితం దక్కుతుందంటే.. బంగారం కోసమో, వజ్రాల కోసమో కొట్లాడి దెబ్బలుతిన్నా, చచ్చినా బాగుంటుంది. కానీ, గంపెడు టమాట కోసం దేశం రెండు గ్రూపులుగా విడిపోయి చంపుకునేంత దాకా పోయారంటే.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! మీరు చదువుతున్నది అక్షరాలా నిజం. కేవలం గంపెడు టమాటల కోసం నైజీరియా దేశస్తులు కొట్టుకోవడం సంచలనం రేపుతున్నది. ఈ ఘర్షణల్లో ఇప్పటిదాకా 20 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఆఫ్రీకా దేశమైన నైజీరియాలో టమాట బుట్ట కారణంగా ఘర్షణలు చెలరేగాయి. దేశం ఉత్తరం, దక్షణం అని రెండుగా విడిపోయింది. ఘర్షణల్లో ఇప్పటివరకు 20 మంది మరణించారు. గత నెలలో ఒక వ్యక్తి బుట్టలో టమాటలతో నైరుతి నగరమైన ఇబాడాన్లోని మార్కెట్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగి టమాటలు రోడ్డుపై పడి అంతటా వ్యాపించాయి. ఇది సమీపంలోని దుకాణదారులు, పోర్టర్లతో వాదనకు దారితీసింది. ఆ వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసి పోరాటంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. దేశం ఉత్తర ముస్లింలు-దక్షిణాది క్రైస్తవులు విడిపోయింది. ఈ ఉద్రిక్తత సంఘటన జరిగిన 4 గంటల తర్వాత హింసాత్మక రూపాన్ని సంతరించుకున్నది. అనేక ప్రాంతాల్లో దుకాణాలపై దాడి చేసి పలువురిని అగ్నికి ఆహుతి చేశారు. ఈ హింసలో ఇప్పటివరకు 20 మంది చనిపోయారు. వేలాది మంది ఇండ్లను వదిలి పారిపోయారు. నైజీరియాలోని అతిపెద్ద నగరమైన లాగోస్‌లో మాంసం అందుబాటులో లేకుండా పోయింది. టమాటలతోపాటు మిగతా కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఘర్షణలను నివారించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ప్రజలు ఇండ్లు విడిచి బయటకురాకుండా కఠిన ఆంక్షలు విధించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

