పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లోనే నవోమి ఒసాకా ఓటమి పాలైంది. నాలుగుసార్లు గ్రాండ్ స్లాట్ టైటిళ్లు గెలిచిన జపాన్ టెన్నిస్ స్టార్ ఒసాకా.. 7-5, 6-4 స్కోర్ తేడాతో అమెరికాకు చెందిన అమండా అనిసిమోవా చేతిలో పరాజయం చవిచూసింది. గత ఏడాది ఇదే టోర్నీలో మధ్యలోంచి వివాదాస్పద రీతిలో ఒసాకా నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇవాళ్టి మ్యాచ్‌లో ఆమె 8 డబుల్ ఫాల్ట్స్ చేసింది. దీంట్లో 29 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ ఉన్నాయి. డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు చెబుతూ గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ నుంచి మాజీ నెంబర్ వన్ ప్లేయర్ ఒసాకా వైదొలిగిన విషయం తెలిసిందే.