Pawan Kalyan| పవన్ కళ్యాణ్ సినిమా చేయాలని కోరకూడదు.. నిర్మాత కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan| టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ సినిమాలలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం ఎంతో కొంత చేయాలని తపన పడ్డాడు. రాజకీయాలలోకి వచ్చిన పదేళ్ల తర్వాత అఖండ మెజారిటీతో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల ముందు ఓవైపు సినిమా షూటింగులు, మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా
Pawan Kalyan| టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ సినిమాలలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం ఎంతో కొంత చేయాలని తపన పడ్డాడు. రాజకీయాలలోకి వచ్చిన పదేళ్ల తర్వాత అఖండ మెజారిటీతో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల ముందు ఓవైపు సినిమా షూటింగులు, మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా గడిపిన పవన్ ఇప్పుడు సినిమాలు చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వ కార్యక్రమాలతోనే బిజీగా ఉన్నారు. అయితే ముందు కమిటైన సినిమాలని పూర్తి చేసేందుకు చాలా కష్టపడుతున్నాడు. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తారా లేదా అనే సందేహం కూడా ఉంది. అయితే ఆయన రానున్న రోజులలో సినిమాలు చేస్తారా, లేదా అనే దానిపై అందరిలో అనేక అనుమానాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పవన్ కెరీర్ పై నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్ మార్చి 28న రిలీజ్ కాబోతున్ననేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే నాగవంశీతో చిత్ర యూనిట్ ఓ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా సితార బ్యానర్ లో 50వ సినిమా పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లలో ఎవరితో చేస్తారని వంశీని హీరో సంగీత్ శోభన్ ప్రశ్నించడంతో దానికి నాగ వంశీ ఆసక్తికర సమాధానం చెప్పారు. పవన్ ఈ రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తాడనేది కోరుకోవాలి కానీ, సినిమా చేయాలని కోరుకోకూడదని అన్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకోవాలే తప్ప ఆయన మనతో సినిమా చేయాలని కోరుకోకూడదు. పవన్ మంచి పొజీషన్‌కి వెళ్లి మన రాష్ట్రానికి ఏం చేస్తాడు.. దేశానికి ఏం చేస్తాడు అని మనం అందరం అనుకోవాలి. అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఎంత త్వరగా 50వ సినిమా జరిగితే, అది తారక్ తోనే జరగాలని నేను భావిస్తున్నాను అని నాగవంశీ అన్నాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశం అయ్యాయి. నిజంగానే పవన్ సినిమాలకి గుడ్ బై చెప్పేస్తాడా అని ఆలోచనలు చేస్తున్నారు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

