లింగాయత్ సమాజ్ అభివృద్ధికి కేసీఆర్ కృషి

కవాడిగూడ, మే 14: లింగాయత్ సమాజ్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. విశ్వగురు మహాత్మా బసవేశ్వర 888 జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌లోని బసవేశ్వర విగ్రహానికి శుక్రవారం పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ట్యాంక్‌బండ్‌పై బసవేశ్వరుని విగ్రహం ఏర్పాటు చేయించడం హర్షణీయమని ఆయన అన్నారు. అదే విధంగా బసవేశ్వర భవనానికి ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసి భవనాన్ని నిర్మించాలని ఆయన కోరారు. బసవేశ్వరుడు 12వ శతాబ్దపు గొప్ప సామాజిక సంఘ సంస్కర్త, మానవతావాది అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బడికన్నే హనుమంతు, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్, సతీశ్, కోట గుండప్ప, వంగి సుభాష్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- TRS MP BB Patil
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

