కాంతార 2లో మోహన్‌లాల్?
కేజీఎఫ్' తర్వాత కన్నడ సినిమా ఖ్యాతిని మరింత పెంచిన సినిమా ‘కాంతార’. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది.
‘కేజీఎఫ్’ తర్వాత కన్నడ సినిమా ఖ్యాతిని మరింత పెంచిన సినిమా ‘కాంతార’. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా దర్శకుడు, హీరో, నిర్మాత అయిన రిషబ్‌శెట్టి ప్రస్తుతం ‘కాంతార 2’ తీసే పనిలో ఉన్నారు. ఇది ‘కాంతార’కు సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్. ‘కాంతార’కు ముందు జరిగిన కథ అనమాట. అత్యంత ప్రతిష్టాత్మకంగా రిషబ్‌శెట్టి తెరకెక్కించనున్న ఈ చిత్రంలో కొందరు స్టార్లు కూడా భాగం కానున్నట్టు తెలుస్తున్నది. వీరిలో బలంగా వినిపిస్తున్న పేరు మోహన్‌లాల్. ఇటీవలే మోహన్‌లాల్‌ని రిషబ్ కలిశారు. ఆ ఫొటోను రిషబ్ షోషల్ మీడియాలో షేర్ చేయడంతో ‘కాంతార 2’లో మోహన్‌లాల్ చేస్తున్నారన్న అనుమానాలకు బలం చేకూరినట్టయ్యింది. అలాగే.. ఇంకొందరు స్టార్ హీరోలు కూడా ఇందులో నటించనున్నారట. ఇది ‘కాంతార’కు ముందు జరిగిన కథ కావడంచేత, కథ డిమాండ్ మేరకు గుర్రపు స్వారీతో పాటు కొన్ని యుద్ధవిద్యల్లో కూడా రిషబ్‌శెట్టి శిక్షణ తీసుకున్నారు. తన సొంత గ్రామంలో ఓ పెద్ద సెట్ వేసి, నాలుగు షెడ్యూల్స్‌లో ఈ సినిమాను రిషబ్ పూర్తి చేస్తారని సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఓ కొలుక్కి వచ్చాయట.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

