మహిళా దినోత్సవం.. గుర్రంపై అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే

రాంచీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జార్ఖండ్‌కు చెందిన మహిళా ఎమ్మెల్యే వెరైటీగా జరుపుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ ఇవాళ రాంచీలోని అసెంబ్లీకి గుర్రంపై వచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిటైర్డ్ కల్నల్ రవి రాథోడ్ తనకు ఈ గుర్రాన్ని గిఫ్ట్‌గా ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. 31 ఏళ్ల అంబా ప్రసాద్ .. బార్కాగావ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ స్థానం నుంచి 2009లో ఆమె తండ్రి యోగేంద్ర ప్రసాద్ సావో గెలుపొందారు. అయితే మావోలతో లింకులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆయన ఆ స్థానానికి రిజైన్ చేశారు. ఆ తర్వాత 2014లో అదే స్థానంలో అంబా ప్రసాద్ తల్లి నిర్మలా దేవి పోటీ చేసి గెలిచారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

