బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితబంధు ఇచ్చే దమ్ముందా?

- అమల్లోనే దళితబంధు.. అమలు చేయాలనటం ఏంది?
- హుజూరాబాద్ ఎన్నికప్పుడు ఆపింది మీరు కాదా?
- పథకాన్ని సంపూర్ణంగా అమలుచేసి తీరుతం
- బీజేపీ నేతలు దళితబంధుపై డ్రామాలాడొద్దు
- ఏడేండ్లలో కేంద్రం దళితులకు చేసిందేంటి?
- ఈటల.. అతిగా ఊహించుకొని మాట్లాడొద్దు
- అర్వింద్ తక్షణమే దళితులకు క్షమాపణ చెప్పాలి
- బీజేపీ నేతలపై మంత్రి కొప్పుల మండిపాటు
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ)/సిద్దిపేట: రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయించాలని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న పథకాన్ని అమలు చేయాలని కొత్తగా డిమాండ్ చేస్తున్న బండి సంజయ్, ఈటల రాజేందర్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి పిచ్చి ముదిరి పాకాన పడిందని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో దళితబంధును ఆపాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది బీజేపీ నేతలు కాదా? అని నిలదీశారు. ఇప్పుడు ఏ అర్హతతో ఆ పథకం గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. దళితబంధుపై బీజేపీ డ్రామాలు ఆపాలని డిమాండ్‌చేశారు. గత ఏడేండ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కారు దళితుల కోసం చేసిన ఒక్క పనైనా చెప్పగలరా అని నిలదీశారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దళితుల కోసం ఏ చేస్తరో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దేశంలోనే మొదటిసారి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకొచ్చిన దళితబంధు పథకం సంపూర్ణంగా అమలై తీరుతుందని స్పష్టం చేశారు.
ప్రైవేటులో రిజర్వేషన్లు తేగలరా?
టీఆర్ఎస్ పేదల కోసం పని చేస్తుంటే, బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నదని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తే బలహీనవర్గాలకు బీఆర్ అంబేద్కర్ ప్రసాదించి పెట్టిన రిజర్వేషన్లు ఎలా అమలవుతాయని ప్రశ్నించారు. బీజేపీకి దమ్ము, ధైర్యం ఉంటే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లను అమలుచేసి, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తారో, తాకట్టు పెడతారో ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలని సవాలు విసిరారు. ఇటీవల దేశవ్యాప్తంగా వెల్లడైన ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి కర్రుకాల్చి వాత పెట్టారని అన్నారు. 32 స్థానాల్లో పోటీ చేస్తే ఎనిమిది స్థానాల్లోనే గెలుపొందిన బీజేపీ గ్రాఫ్ ఏమిటనేది తేలిపోయిందని పేర్కొన్నారు. ఓ వైపు ధాన్యం కొనలేమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్తుంటే, మరోవైపు ఇక్కడేమో ధాన్యం కొనాలని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేయటం సిగ్గుచేటని విమర్శించారు. ఈటల రాజేందర్‌కు గెలుపు గర్వం తలకెక్కిందని, అందుకే విర్రవీగుతూ మాట్లాడుతున్నారని కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అతిగా ఊహించుకొని మాట్లాడొద్దని హెచ్చరించారు. బెదిరిస్తే ఇక్కడ బెదిరిపోయేవారు ఎవరూ లేరని స్పష్టంచేశారు. హుజూరాబాద్‌లో ఈటల బీజేపీ అభ్యర్థి కాదని, కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి అని అన్నారు. అక్కడ తమ పార్టీకి వచ్చిన నష్టమేమీలేదని, తమ ఓటు బ్యాంకు పదిలంగా ఉన్నదని గుర్తుచేశారు. ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును లొట్టపీసు కేసు’ అంటూ బీజేపీ ఎంపీ అర్వింద్ మాట్లాడటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితులు నీకు లొట్టపీసుతో సమానమా? అని ప్రశ్నించారు. వెంటనే దళితులకు క్షమాపణ చెప్పి నిజామాబాద్ నడిబొడ్డున ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

