విద్యార్థినుల వసతి గృహానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ‘సెస్’ ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బేగంపేటలోని ‘సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్’ సెస్‌లో విద్యార్థునుల వసతి గృహానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల మీద అధ్యయనాలు చేస్తూ సెస్ ఎప్పటికపుడు విలువైన సూచనలు చేస్తున్నదని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఇక్కడి పీహెచ్డీ కోర్సుకు డిమాండ్ ఉందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు చేరుతున్నారని తెలిపారు.
వీరి అవసరాల నిమిత్తం రు. 5 కోట్లతో బాలికల వసతి గృహం ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. సమగ్రమైన ఆర్థిక, సామాజిక అధ్యయనం ఉన్నప్పుడే ఏ రాష్ట్రం అయినా, దేశం అయినా పురోగతి చెందుతుంది. ఆ ఫలితాల ఆధారంగా మంచి పరిపాలన అందించడం సాధ్యం అవుతుందన్నారు.
రాబోయే రోజుల్లో బడ్జెట్ అంశాలకు సంబంధించి సెస్ తో మరింతగా కలిసి పని చేద్దామన్నారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, సెస్ ఫౌండర్ మెంబర్లు మహేందర్ రెడ్డి, జీఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

