యూపీలో శాంతిభద్రతలు అధ్వాన్నం: మాయావతి

లక్నో: ఉత్తరప్రదేశ్లో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై, కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు. తీవ్రంగా పరిగణించాల్సిన కేసుల విషయంలో కూడా యోగీ సర్కారు ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ రకం నేరం జరిగినా అత్యంత హేయంగానే ఉంటున్నదని విమర్శించారు. నేరాల నియంత్రణలో ఉత్తరప్రదేశ్ చాలా చెత్త రికార్డు మూటగట్టుకున్నదని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో దళితులు, మహిళలపై కొనసాగుతున్న దాడులు, వేధింపులను చూసి ప్రతిఒక్కరూ ఆందోళన చెందుతున్నారని మాయావతి మండిపడ్డారు. సీరియస్ కేసుల విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని ఆమె హిందీలో ట్వీట్ చేశారు. అదేవిధంగా కేంద్రంపై మాయావతి మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లో దళితులపై వేధింపులకు పాల్పడటమే కాకుండా, ఒక వ్యక్తిని దారుణంగా హత్యచేశారని, గుజరాత్లో దళిత ఆర్టీఐ కార్యకర్తను చంపేశారని, ఈ ఘటనలతో దేశంలో దళితులకు, మహిళలకు రక్షణ లేదనే విషయం స్పష్టమవుతోందని ఆమె విమర్శించారు.
ఇటీవల హత్రాస్లో ఓ 50 ఏండ్ల వ్యక్తిని లైంగిక వేధింపుల కేసులు జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చిన వ్యక్తి దారుణంగా కాల్చిచంపాడు. తన కుమార్తె లైంగిక వేధింపులకు పాల్పడినందుకు జైలుకు పంపాడన్న కోపంతో అతను ఈ దారుణంగా ఒడిగట్టాడు. ఈ ఘటన నేపథ్యంలో మాయావతి ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితి తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

