డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు వాడినవారందరికీ మాస్టర్‌కార్డ్ తెలిసిన పేరే. అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఆర్థిక సేవల సంస్థ ప్రధాన వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా చెల్లింపుల్ని ప్రాసెస్ చేయడం.మాస్టర్ కార్డ్ బ్రాండెడ్ డెబిట్, క్రెడిట్, ప్రిపెయిడ్ కార్డుల ద్వారా జరిగే కొనుగోళ్లకు జరిగే చెల్లింపుల్ని ఇది ప్రాసెస్ చేస్తుంది.
2006లో స్టాక్ మార్కెట్లో లిస్టయ్యేంతవరకూ మాస్టర్‌కార్డ్…25,000కుపైగా ఆర్థిక సంస్థలకు చెందిన సహకార సంస్థ. భారత సంతతికి చెందిన అజయ్‌బంగా ప్రస్తుత మాస్టర్‌కార్డ్‌కు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవల్ని వేగంగా డిజిటలైజ్ చేసేందుకు తాజాగా మాస్టర్‌కార్డ్ ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసింది.
ప్రధాన కార్యాలయం న్యూయార్క్, అమెరికా
ఆదాయం 18.88 బిలియన్ డాలర్లు (2021)
నికరలాభం 8.69 బిలియన్ డాలర్లు
మొత్తం ఆస్తులు 37.67 బిలియన్ డాలర్లు
మొత్తం ఉద్యోగులు 24,000