మందిర బేడీ అనగానే 2003 క్రికెట్ ప్రపంచకప్ వ్యాఖ్యాత గుర్తొస్తుంది. కానీ ఆమె టీనేజ్ నుంచే సినిమాల్లో నటిస్తున్నది. ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’, ‘శక్తి’ చిత్రాల్లో హీరోకు సోదరి పాత్రల్లో నటించింది మందిర. ఆ తర్వాత వరుసగా ఇలాంటి క్యారెక్టర్స్ రావడంతో వాటిని వదిలేసి బుల్లితెరపై అడుగుపెట్టింది. సీరియల్స్, షోస్‌లో నటిస్తున్నది. ఆ మధ్య ప్రభాస్ ‘సాహో’ చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది. ఒకే తరహా క్యారెక్టర్లు (టైప్ కాస్టింగ్) చేయడం ఇష్టంలేకే సినిమాలకు దూరంగా ఉన్నానని చెబుతున్నది మందిరా బేడి. తాజాగా మందిర బేడీ స్పందిస్తూ…‘దిల్ వాలేలో సోదరి పాత్రలో నటించాక..నాకన్నీ అవే తరహా పాత్రలు వచ్చాయి. సోదరి, మరదలు, సెకండ్ హీరోయిన్ లాంటి వేషాలకు అడిగారు. ఈ టైప్ కాస్టింగ్‌కు భయపడే సినిమాలు వదులుకున్నా. టీవీ రంగంలోకి వచ్చాక కావాల్సిన సృజనాత్మక స్వేచ్ఛ లభించింది. ఎప్పుడైనా విభిన్నమైన క్యారెక్టర్స్ వస్తే ఒప్పుకుంటున్నా. అని చెప్పింది. గతేడాది ‘ఖుబూల్ హై’, ‘సిక్స్’ అనే రెండు వెబ్ సిరీస్‌ల్లో నటించింది మందిర.