BRS | హామీలు అమలు చేయని కాంగ్రెస్ను వీడిన మండల ప్రెసిడెంట్.. బీఆర్ఎస్లో చేరిక
BRS | గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు నేరవేర్చక పోవడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బీఆర్ఎస్ బాట పడుతున్నారు.
కొల్లాపూర్ : గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు నేరవేర్చక పోవడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బీఆర్ఎస్ బాట పడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ ( BRS ) కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ( Beeram Harsavardan ) సమక్షంలో కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్( Kirankumar ) ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికలలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ అరాచకాలను నమ్మకద్రోహాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులే భరించలేక పార్టీని విడుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కొల్లాపూర్ అభివృద్ధిని కాంక్షించి బీఆర్ఎస్లో చేరుతున్న వారందరికీ తగిన ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.
స్థానిక ఎన్నికలలో గులాబీ పార్టీ అత్యధిక స్థానాలలో గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ బలవంతపు వేలంపాటలో సర్పంచ్ స్థానాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు బలవంతపు వేలం పాటలో సర్పంచ్ పదవి కొనుక్కున్నవారు తన వద్దకు రావొద్దని, మళ్లీ వారిని సన్మానించడం ద్వంద వైఖరి బయటపడిందన్నారు. కొల్లాపూర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయక ఓట్లు అడగలేని పరిస్థితి ఉందని విమర్శించారు.
జిల్లాకు చెందిన మంత్రి అభివృద్ధి పనులు చేయకుండా కక్ష రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కిరణ్కుమార్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో నియోజక వర్గంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూ రెడ్డి రఘువరన్ రెడ్డి, సురేష్ కుమార్ రెడ్డి, కోడేరు మండల బీఆర్ఎస్ అధ్యక్షులు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

