అపర్ణా జనార్దనన్ బంగారు బొమ్మే! కోటేరు ముక్కు. విశాల నేత్రాలు. అందమైన నవ్వు. ఈ మలయాళ కుట్టి స్కిన్‌షోకు దూరంగా ఉంటూ.. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్నది. అందులోనూ, అపర్ణకు డ్రెస్ సెన్స్ చాలా ఎక్కువ.
‘నా ఆహార్యమే నా వ్యక్తిత్వం’ అంటుంది తను. ఈ మధ్య హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ముచ్చటగా ముస్తాబై వచ్చింది. లైట్ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్‌పై బీడ్స్‌తో వర్క్ చేసిన టాప్కు.. యాంకిల్ లెంగ్త్త్ ప్యాంట్, సిల్వర్ లైన్స్ జతచేసిన దుపట్టా చక్కగా నప్పాయి. విరబోసిన కురులకు మ్యాచ్ అయ్యేలా పెద్దపెద్ద జుంకాలు వేసుకుంది. బాపు బొమ్మను గుర్తుకు తెచ్చేలా బొట్టూకాటుక పెట్టుకుంది. ‘మినిమలిజం’ తనకు ఇష్టమని చెప్పడానికేమో.. సన్నని ఉంగరం ధరించింది.
నల్లరంగు హై హీల్స్.. ఆమె నడిచినంత మేరా సౌందర్య సామ్రాజ్యమే అని ప్రకటించాయి. అపర్ణ కథానాయికగా నటించిన ‘లవ్ యూ రామ్’ ఫస్ట్ లుక్ ఈ మధ్యే విడుదలైంది.