Malavika Mohanan | వినూత్న పాత్రలను ఎంచుకుంటూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి మాళవికా మోహనన్(Malavika Mohanan). చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. ఘాటైన ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును మాయలో పడేస్తుంది. ‘పేట’ (Rajini Peta) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. ‘మాస్టర్’ (Master) సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె హిందీలో ‘యుద్ర (Yudhra)’ సినిమాతో పాటు, విక్రమ్ తంగళన్ (Thangalan) మూవీలో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాను చేయబోయే ఏ రోల్కైనా ఇంపార్టెన్స్ లేకపోతే.. అలాంటి చిత్రాల్లో నటించనని మాళవికా మోహనన్ తెలిపింది. రూ.500 కోట్లు వసూలు చేసే భారీ బడ్జెట్ చిత్రంలో కూడా తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే నిర్మోహమాటంగా నో చెప్పేస్తానని వెల్లడించింది. తనకు ఇంపార్టెన్స్ లేని సినిమాలో చేసి అది సూపర్ హిట్ అయినా అలాంటి సినిమాల వల్ల తనకు గుర్తింపు రాదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తేల్చిచెప్పింది. ప్రస్తుతం మాళవిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.