‘మహా సముద్రం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. శర్వానంద్ ఖాతాలో మరో డిజాస్టర్..
‘Maha Samudram’ First Weekend Collections | దసరా సినిమాల ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వచ్చేసాయి. అందులో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ముందున్నాడు. ఇక శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్

దసరా సినిమాల ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వచ్చేసాయి. అందులో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ముందున్నాడు. ఇక శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం మహా సముద్రం నిరాశ పరిచింది. ఆర్ఎక్స్ 100 లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మూడేళ్ళకు పైగా గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు అజయ్. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు తొలిరోజు టాక్ తేడాగా వచ్చింది. తొమ్మిదేళ్ళ తర్వాత సిద్ధూ నటించిన తెలుగు సినిమా ఇది.
పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన మహా సముద్రం సినిమా ఆడియన్స్ కు కావాల్సిన కిక్ ఇవ్వలేకపోయింది. ఔట్ డేటెడ్ కథకు తోడు స్క్రీన్ ప్లే లోపాలు సినిమాకు మైనస్ అయ్యాయి అంటున్నారు ప్రేక్షకులు. అక్టోబర్ 14న మహా సముద్రం థియేటర్స్ లోకి వచ్చింది. తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా రెండో రోజు నుంచి చేతులెత్తేసింది. ఇందులో మహా పాత్రలో అదితి రావు హైదరీ నటించింది. అను ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. శర్వానంద్ ఉన్నాడు కాబట్టి మంచి బిజినెస్ చేసారు. మరి ఈ చిత్రం 4 డేస్ కలెక్షన్స్ చూద్దాం..
నైజాం: 1.81 కోట్లు
సీడెడ్: 1.04 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.83 కోట్లు
ఈస్ట్: 0.43 కోట్లు
వెస్ట్: 0.32 కోట్లు
గుంటూరు: 0.57 కోట్లు
కృష్ణా: 0.38 కోట్లు
నెల్లూరు: 0.29 కోట్లు
ఏపీ + తెలంగాణ 4 రోజుల వసూళ్లు: 5.67 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.59 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్సన్స్: 6.26 కోట్లు
శర్వానంద్, సిద్ధార్థ్ లాంటి స్టార్స్ ఉండటంతో ‘మహా సముద్రం’ చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమాను ఏకంగా రూ.16.48 కోట్లకు అమ్మారు. అంటే బ్రేక్ ఈవెన్ కోసం రూ.17 కోట్ల వరకు రావాలి. కానీ 4 రోజుల్లో ఇప్పటి వరకు ఈ సినిమా వసూలు చేసింది కేవలం రూ.6.26 కోట్లు మాత్రమే. అంటే మరో 10 కోట్లకు పైగానే వసూలు చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కష్టంగా అనిపిస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

