Maamannan Movie | మామన్నన్ నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మారి సెల్వరాజ్
Maamannan | పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో డైరెక్టర్ మారి సెల్వరాజ్ తెరకెక్కించిన చిత్రం నాయకుడు (మామన్నన్). జూన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది.
Maamannan | పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో డైరెక్టర్ మారి సెల్వరాజ్ తెరకెక్కించిన చిత్రం నాయకుడు (మామన్నన్). స్టార్ కమెడియన్ వడివేలు ( Vadivelu), ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin), నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటించారు. జూన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. కాగా ఈ సినిమా నుంచి చిత్ర దర్శకుడు మారి సెల్వరాజ్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను షేర్ చేశాడు.
చిత్ర దర్శకుడు మారి సెల్వరాజ్ “మామన్నన్ చదవని పేజీలు అంటూ” సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో “వడివేలు అతని భార్య పని చేసుకుంటూ.. పాట పాడుతూ ఉంటారు. ఇంతలోనే ఉదయనిధి స్టాలిన్ నాన్న నాన్న అంటూ పిలుస్తున్నట్లు” ఈ వీడియో సాగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీలో రికార్డు స్ట్రీమింగ్ సొంతం చేసుకుంటున్నది. గత వారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 1 ట్రేండింగ్లో దూసుకుపోతుంది.
The Unread Pages Of #Maamannan!#MaamannanBlockbuster #1onNetflix @Udhaystalin @RedGiantMovies_ @KeerthyOfficial #Vadivelu @arrahman #FahadhFaasil @thenieswar @editorselva @dhilipaction @kabilanchelliah @kalaignartv_off @MShenbagamoort3 @SonyMusicSouth @NetflixIndia… pic.twitter.com/Hy9HQ4su5n
— Mari Selvaraj (@mari_selvaraj) August 3, 2023
ఈ సినిమా కథలోకి వెళ్తే మహారాజు (వడివేలు) బలహీన వర్గాల ప్రతినిధిగా ఎదిగి ఎమ్మెల్యే అవుతాడు. అతని కొడుకు రఘువీర (ఉదయనిధి స్టాలిన్) విద్యాధికుడు. ఊళ్లోనే మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తుంటాడు. మరోవైపు ఎంత ఎదిగినా తన కులవృత్తి అయిన పందుల పెంపకాన్ని కొనసాగిస్తుంటాడు. అదే ఊళ్లో మరో నాయకుడు రత్నవేలు (ఫహద్ ఫాజిల్) ఉన్నతవర్గానికి ప్రతినిధిగా చెలామణీ అవుతుంటాడు. రఘువీర స్నేహితురాలు లీలా (కీర్తి సురేశ్) స్థానికంగా విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. కొందరు ఆమె కోచింగ్ సెంటర్‌ను బలవంతంగా మూయించే ప్రయత్నం చేస్తుంటారు. ఆ కోచింగ్ సెంటర్‌కు రత్నవేలుకు ఉన్న సంబంధం ఏమిటి? ఉన్నత వర్గీయుల రాజకీయాలను మహారాజు, రఘువీర ఎలా ఎదుర్కొన్నారన్నది మిగిలిన కథ! అక్కడక్కడా నిదానంగా సాగే కథనం కాస్త విసుగు పుట్టించినా.. పతాక సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

