బీజింగ్: ఉపగ్రహాలను ధ్వంసం చేసే లేజర్ ఆ యుధాన్ని చైనా అభివృద్ధి చేసింది. ఈ ఆయుధంతో శాటిలైట్ సిగ్నల్‌ను జామ్ చేయటం, ధ్వంసం చేయటం వంటివి చేయవచ్చని ఏషియా టైమ్స్ పేర్కొన్నది. ‘రిలేటివిస్టిక్ ైక్లెస్ట్రాన్ ఆంప్లిఫయర్’ మైక్రోవేవ్ మెషీన్లను డ్రాగన్ దేశం తయారుచేసిందని, అవి 5 మెగావాట్ల తరంగాలను విడుదల చేసి, ఉపగ్రహాన్ని పనిచేయకుండా చేస్తాయని వెల్లడించింది. వీటితో భూమి నుంచి అంతరిక్షంలోని లక్ష్యాలను ఛేదించటం సాధ్యం కాదని తెలిపింది. తమ దేశ ఉపగ్రహాలపై వీటిని అమర్చి, శత్రుదేశాల శాటిలైట్లను ధ్వంసం చేయొచ్చని పేర్కొంది.