కంగారూ కేర్ | శిశువును తల్లి ఎక్కువ సేపు ఎత్తుకుంటే ఎన్నో లాభాలున్నాయి.. ఏంటో తెలుసా?
తల్లి కంగారూ తన బిడ్డను శరీరానికి హత్తుకున్నట్టే, తల్లి కూడా తన శిశువును ఎక్కువ సేపు ఎత్తుకుంటే ఎన్నో లాభాలు. ముఖ్యంగా బిడ్డ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.

దీన్నే ‘కంగారూ కేర్’ అంటారు. కంగారూ అనే జంతువు తన శిశువును కడుపు వద్ద ఉన్న సంచిలో సురక్షితంగా ఉంచి పెంచే పద్ధతిని స్ఫూర్తిగా తీసుకుని ఈ టెక్నిక్‌ను కనుగొన్నారు. తక్కువ ఖర్చుతో, బరువు తక్కువ శిశువులను రక్షించడానికి ఇదొక విప్లవాత్మకమైన విధానం. శ్వాస సరిగ్గా తీసుకుంటూ ఆరోగ్యం నిలకడగా ఉన్న 1,500-1,800 గ్రాముల బరువున్న శిశువులకు ఇది బాగా ఉపకరిస్తుంది. నర్సరీలోని శిశువులకు కూడా మధ్యమధ్యలో ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. అయితే, ఈ విధానంలో తల్లికి చర్మ సంబంధమైన అంటువ్యాధులు ఉండకూడదు. రోజూ స్నానం చేస్తూ వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
తల్లీ పిల్లలిద్దరికీ ముందు నుంచి విప్పే వెసులుబాటు ఉన్న గౌన్లు వేయాలి. శిశువు చేతులకు, కాళ్లకు మిటెన్స్, సాక్స్, డైపర్ తొడగాలి.శిశువును నిలువుగా తల్లి రెండు స్థనాల మధ్య ఉంచాలి. బిడ్డ ముక్కు మూసుకుని పోకుండా తల ఒకవైపునకు తిప్పాలి. కాళ్లు, చేతులు మడిచి కప్పలా ఉంచి, జారిపోకుండా తల్లికి శిశువుకు కలిపి ఒక బైండర్ కట్టొచ్చు. వీపుపై ఉన్ని శాలువా ఉంచాలి. శిశువు బరువు 2,500 గ్రాములకు పెరిగే వరకు ఈ పద్ధతిని పాటించొచ్చు. శిశువుకు బాగా చెమట పట్టినప్పుడు, బిడ్డ అసహనంగా ఉన్నప్పుడు ‘కంగారూ కేర్’ ఆపేయాలి.
లాభాలు: శిశువు తీవ్రమైన చలికి గురికాకుండా నివారించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. త్వరగా బరువు పెరగడానికి కూడా దోహదపడుతుంది. మాతాశిశు అనుబంధం వృద్ధి చెందడం వల్ల ఏడుపు తగ్గించి, హాయిగా నిద్రపోతారు. దీనివల్ల తల్లిలో పాల ఉత్పత్తీ పెరుగుతుంది.
డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

